జనసేన నుంచి రాపాక ని సస్పెండ్ చెయ్యబోతున్నారా ? పవన్ కీలక వ్యూహం ?

-

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక పక్క సీఎం వైఎస్ జగన్ పై తీసుకున్న నిర్ణయాలపై తీవ్రస్థాయిలో మండిపడుతుంటే మరోపక్క అదే పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు అద్భుతమని మీడియా ముందు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పబ్లిక్ గానే పలచబడి పోతున్నాయి.

ఇటువంటి తరుణంలో జనసేన పార్టీలో ఉన్న నాయకులు మరియు కార్యకర్తలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తీరుపై మండిపడుతున్నారు. అధ్యక్షుడు మాటలను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా మీడియా ముందు రాపాక మాట్లాడటం తగదని జనసేన పార్టీ నుండి రాపాక ని సస్పెండ్ చేయాలని పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యవహరిస్తున్న తీరుపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు. కేవలం తన నియోజకవర్గానికి సంబంధించి విషయాలను మీడియా ముందు మాట్లాడితే బాగుంటుందని జనసేన పార్టీ తరుపున గెలిచి జనసేన పార్టీ ఏవైతే అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలను విభేదిస్తుందో వాటి విషయాలలో రాపాక వరప్రసాద్ మాట్లాడకుండా ఉండాలని..

ఏమైనా మాట్లాడాల్సి వస్తే మాత్రం పార్టీ నుండి సస్పెండ్ చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో మాత్రం ఇంకా ఈ విధంగానే రాపాక వరప్రసాద్.. జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ జనసేన పార్టీని పలుచన చేసే విధంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీ నుండి సస్పెండ్ చేసే ఆలోచనలో పవన్ వున్నట్లు జనసేన పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news