వైరల్ వీడియో; నిందితుడిని పట్టుకోబోతుంటే పోలీస్ అధికారిని గుద్దిన రైలు…!

-

విధి నిర్వహణలో భాగంగా నిందితుడిని పట్టుకోవడం కోసం ఒక పోలీసు అధికారి చేసిన ప్రయత్నం అతని ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. నిందితుడిని పట్టుకోవడానికి ఆ అధికారి రైల్వే పట్టాలపై నడుస్తుండగా వేగంగా వచ్చిన ఒక రైలు అతన్ని ఢీకొట్టింది. జార్జియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు విస్తృతంగా వైరల్ గా అవుతుంది.

పోల్క్ కౌంటీకి చెందిన పోలీస్ అధికారి అండీ అండర్సన్ ఒక కేసులో భాగంగా అనుమానితుడిని వెంబడిస్తూ రాక్‌మార్ట్‌లోని రైలు పట్టాలపైకి పరిగెడుతూ వెళ్ళాడు. అయితే అతను తన ప్రాణాలను కూడా మర్చిపోయి దృష్టంతా నిందితుడి మీదే పెట్టాడు. ఈ క్రమంలో రైలు వస్తున్న సంగతి ఆ అధికారి అసలు పట్టించుకోలేదు. దీంతో రైలు అతడిని వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో అండీ గాల్లోకి ఎగిరి పట్టాల దూరంగా పడిపోయాడు. ఈ ప్రమాదం అతడికి అమర్చిన బాడీ కెమేరాలో రికార్డు కావడంతో దానిని బయటపెట్టారు అధికారులు. ఈ రైలు ప్రమాదంలో ఆండీకి తీవ్ర గాయాలు కాగా, ఎముకలు నుజ్జయ్యాయి. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అతను కోలుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుందని అక్కడి వైద్యులు తెలిపారు. అయితే నిందితుడు మాత్రం దొరకలేదు.

Read more RELATED
Recommended to you

Latest news