మంచితనానికి పోతే అలుసుగా తీసుకుని రెచ్చిపోతున్నారు అని టీడీపీ కి చెక్ పెట్టే విధంగా గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశారు వైయస్ జగన్. ఉగాది లోపు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకులను మరియు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే వైసీపీలోకి రావాలనుకుంటున్నారో వాళ్లని పార్టీలోకి తీసుకోవడానికి జగన్ డోర్లు ఓపెన్ చేయటానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ ఒక్క దెబ్బతో తెలుగుదేశం పార్టీకి ఉన్నా ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో పాటు మరోపక్క అమరావతి విషయంలో కూడా జగన్ సర్కార్ సెన్సేషనల్ నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే అమరావతి నుండి విశాఖకు రాజధానిని తరలించడం కోసం ఇటీవల ప్రభుత్వ అధికారులతో జగన్ భేటీ అయినట్లు అంతా ఓకే అయినట్లు సమాచారం. వచ్చే మే నెలాఖరుకల్లా సచివాలయం మొత్తం విశాఖపట్టణానికి తరలించాలని వైయస్ జగన్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కచ్చితంగా ఈ విషయంలో ఎవరి మాట వినే ప్రసక్తే లేదు అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నట్లు పార్టీలో వస్తున్న టాక్.
మరోపక్క అమరావతి ప్రాంతంలో రైతులు మరి స్థానిక ప్రజలు గత కొన్ని రోజుల నుండి పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా గాని వాటిని పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందటం కోసం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీలో నుండి వస్తున్న సమాచారం.