ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్ట్ సమర్థించింది. ఈ విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లినా ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు అయింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ సడలించాలని ఆదేశాలు సుప్రీంకోర్టు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరిగిన సందర్భంలో చాలాచోట్ల ఏకగ్రీవం అయ్యాయి.దాంతో జగన్ పార్టీ నాయకులు తెగ రెచ్చిపోతున్నారు. ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ మళ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని మొదటి నుండి జరగాలని ఎన్నికల కోడ్ తీసేస్తే బాగుంటుందని ఆ విషయంలో కొత్త షెడ్యూల్ విడుదల చేయాలని టిడిపి కోరుతోంది. ముఖ్యంగా కొత్త పథకాలు అమలు చేయ కూడదు అంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ మొదలు పెట్టింది.
ఇది ఓటర్లకు వ్యక్తిగత లబ్ది చేకూర్చటమే… అంటే ఓటర్లని ప్రలోభాలకు గురిచేయటమే అవుతుంది. కాబట్టి ఎన్నికల సంఘం ప్రక్రియ మొత్తాన్ని నిష్పక్షపాతంగా రద్దుచేసి అప్పుడు కొత్త షెడ్యూల్ ని విడుదల చేయాలని టిడిపి నాయకులు కోరుతున్నారు. నిజంగా ఎన్నికల కోడ్ ఈ సమయంలో ఎత్తేసి మళ్లీ ఫ్రెష్ గా నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది అంటే జగన్ కి అతి భారీ దెబ్బ తగిలినట్లు అవుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.