బ్రేకింగ్ ;తెలంగాణాలో 5 జిల్లాలు, ఏపీలో మూడు జిల్లాలు లాక్ డౌన్…!

-

తెలంగాణాలోని 5 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ౦ లాక్ డౌన్ ప్రకటించింది. హైదరాబాద్, మేడ్చల్, భద్రాద్రి కొత్త గూడెం, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మూడు జిల్లాలు లాక్ డౌన్ చేసారు. కృష్ణా, ప్రకాశం, విశాఖ జిల్లాలను లాక్ డౌన్ చేసారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ఈ జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఉండే అవకాశం ఉండటంతో లాక్ డౌన్ చేసారు.

దేశం మొత్తం 75 జిల్లాల్లో లాక్ డౌన్ చేసారు. కర్ణాటకలో 5 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. బెంగళూరు, కొడగు, చిక్ బల్లాపూర్, మైసూర్, కలబురిగి జిల్లాల్లో లాక్ డౌన్ చేసారు. కేరళలో 10 జిల్లాల్లో లాక్ డౌన్ చేసారు. తమిళనాడులో చెన్నై తో పాటుగా రెండు జిల్లాలను లాక్ డౌన్ చేసారు. కేరళలో పది జిల్లాల్లో లాక్ డౌన్ చేసారు. అదే విధంగా ఢిల్లీ లో ఢిల్లీ తో పాటుగా 7 జిల్లాల్లో లాక్ డౌన్ చేసారు.

కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. దేశంలో ఇప్పటి వరకు 350 వరకు కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఏడుగురు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీనితో కరోనా వైరస్ ని ఇప్పుడు కట్టడి చేయడానికి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ జిల్లాల్లో 31 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 64 కేసులు కేరళలో 40 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news