కరోనా పుట్టిన ఊహాన్ నగరం… అదే అండి చైనా లోని ఊహాన్ నగరంలో లాక్ డౌన్ ఎత్తేసారు. అక్కడ కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోవడం తో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కోటి 60 లక్షల జనాభా ఉండే వుహాన్ నగరం చుట్టూ హ్యూబే ప్రావిన్స్ ఉంది. ఈ మొత్తం ప్రదేశంలో ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలూ ఉంటారు.
అక్కడ కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం వందల మంది పిట్టల్లా రాలిపోవడం తో చైనా సర్కార్… వెంటనే లాక్ డౌన్ ప్రకటించి దాని విషయంలో చాలా కఠినం గా వ్యవహరించింది. ఈ రోజు ఇంట్లో ఉండండి రేపటి నుంచి సంతోషంగా తిరగండి అంటూ లాక్ డౌన్ ని చాలా జాగ్రత్తగా అమలు చేసింది. ఇప్పుడు అక్కడ కరోనా లేకపోవడంతో లాక్ డౌన్ ని ఎత్తివేస్తున్నామని చైనా సర్కార్ ప్రకటించింది.
అక్కడ లాక్ డౌన్ ని 76 రోజుల పాటు అమలు చేసారు. దాదాపు 11 వారాల పాటు అమలు అయింది. దీనితో రైళ్ళు బస్సులు, అన్నీ కూడా తిరుగుతున్నాయి. ప్రజలు స్వేచ్చగా రోడ్ల మీదకు వస్తున్నారు. వ్యాపారాలు మొదలయ్యాయి. ఏ ఆంక్షలు లేకుండా నగరాల మధ్య రాకపోకలు ఉన్నాయి. దేశీయ విమానాలను అనుమతించారు. హారన్, సైరన్ చెయ్యకుండా… ప్రయాణికుల ట్రైన్… వుహాన్ నగరం నుంచి బుదవారం బయలుదేరింది.
బుధవారం నుంచి వుహాన్‌లో ప్రస్తుతం ఉన్న కోటి 10 లక్షల మంది ప్రజలు స్వేచ్ఛగా ఇళ్లలోంచి బయటకు వచ్చారు. వారు అందరికి కూడా ప్రభుత్వం ఒక యాప్ ఇచ్చింది. ఆ యాప్ లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే రికార్డ్ అవుతుంది. వాళ్ళు దగ్గినా తుమ్మినా సరే ప్రభుత్వానికి సమాచారం వెళ్తుంది. వెంటనే వాళ్ళను చికిత్సకు పంపిస్తారు. అక్కడ అసలు ఒక్క కేసు కూడా లేదని తెలుస్తుంది. అందుకే లాక్ డౌన్ ఎత్తివేశారు.