ఆన్లైన్ లో తల్లి ప్రధమ వర్ధంతి చేస్తున్న కేంద్ర మంత్రి…!

-

దేశంలో లాక్ డౌన్ దెబ్బకు ఏ ఒక్కరు కూడా బయటకు రావడం లేదు. ప్రజా ప్రతినిధులు వచ్చినా సరే చాలా జాగ్రత్తలు తీసుకునే బయటకు వస్తున్నారు. ప్రజలకు స్పష్టమైన ఆదేశాలు కేంద్రం జారీ చేయడం తో అందరూ ఆదేశాలను పాటిస్తున్నారు. కేంద్ర మంత్రులు తమ కార్యాలయాలకు లేదా ఇళ్ళకు మాత్రమే పరిమితం అవుతున్నారు. అధికారులతో ఇళ్ళ నుంచే సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇక ఈ నేపధ్యంలోనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తల్లి ప్రధమ వర్ధంతిని ఆన్లైన్ లో నిర్వహించాలని ఆయన భావించారు. కిషన్‌రెడ్డి తల్లి అండాలమ్మ ప్రథమ వర్థంతిని సోమవారం తన స్వగామ్రం రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో జరపాలి.

అయితే ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఇక్కడికి రావడం సాధ్యం కావడం లేదు. స్వగ్రామంలో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. తోబుట్టువులు తిమ్మాపూర్‌లో ఉన్నారు. కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసం నుంచి ఆన్‌లైన్ ద్వారా తన తల్లి వర్థంతిని శాస్త్రోక్తంగా ఆయన నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రసంశలు కురిపిస్తున్నారు పలువురు.

Read more RELATED
Recommended to you

Latest news