గుడ్ న్యూస్: ఏపీలో ఏదీ ఆగడంలేదు!

-

అసలే అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రం… సంక్షేమ పథకాలేమో అధికం… ఇక కరోనా పుణ్యమా అని రాష్ట్ర ఖజానాకి అవుట్ గోయింగే కానీ ఇన్ కమింగ్ లేదు! ప్రతీరోజూ సుమారు రూ. 150 కోట్ల ఆదాయం కోల్పోతున్న సమయం! ఈ పరిస్థితుల్లో కూడా సంక్షేమం ఆగేది లేదని ప్రకటించడానికి ఎంత దైర్యం కావాలి? ఎంత విశాల హృదయం కావాలి? సామాన్యుడి జీవన విధానంపై ఎంత అవగాహన ఉండాలి? ప్రస్తుతం జగన్ అలాంటి నిర్ణయమే తీసుకున్నారు!

వివరాళ్లోకి వెళ్తే… ఆర్థికంగా రాష్ట్రం కష్టాల్లో ఉన్నా.. పేదవాడికి మేలు చేసే సంక్షేమ పథకాల విషయంలో వెనక్కి తగ్గేదిలేదని ప్రకటిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సందర్భంగా జగన్ సంక్షేమ పథకాలపై క్లారిటీ ఇచ్చారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, అమ్మ ఒడి పథకాలతోపాటూ, పెన్షన్లను రూ. 2,250 వరకు తీసుకెళ్లామని చెప్పిన జగన్.. ఈ నెల 24న సున్నా వడ్డీ పథకానికి రూ. 1400 కోట్లు ఇవ్వబోతున్నామని వెల్లడించారు.

ఇదే క్రమంలో ఫీజురీయింబర్స్‌ మెంట్‌ కోసం ఈనెలలోనే గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 1800 కోట్లు చెల్లించామని.. ఈ ఏడాది మార్చి 31 వరకు బకాయిలు లేకుండా ఫీజురీయింబర్స్‌ మెంట్‌ చెల్లిస్తున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లి అకౌంట్‌ లోనే నేరుగా ఫీజురీయింబర్స్‌ మెంట్‌ జమ చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో ఏపీలోని అన్ని దేవాలయాలు, చర్చిలు, మసీదులకు రూ.5000 ఇవ్వాలని జగన్ నిర్ణయించారు.

దీంతో… ప్రభుత్వం ఏ ఒక్కరిదో కాదని… సామాజిక, కుల, మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ సంతృప్తికరమైన జీవితం గడపాలన్నదే ఈ ప్రభుత్వ ధ్యేయం అని.. ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం అలాగే ఉంచాలనే ఆలోచన జగన్ ది అని ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తుంది! కాగా… కరోనా నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి రూ. వెయ్యి అందజేయడం, నెలకు మూడు సార్లు రేషన్‌ ఇవ్వడం.. ఈ క్రమంలో ఇప్పటికే రెండు సార్లు ఇచ్చేయడం తెలిసిన విషయమే!

Read more RELATED
Recommended to you

Latest news