పరీక్షలు పెంచితే మంచిదా ? లిమిట్ లో చేస్తే మంచిదా ?

-

Covid-19 పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో మొదటి స్థానంలో ఉంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ టెస్టింగ్ సామర్థ్యాలను పెంచడానికి కృషి చేస్తోంది. రాష్ట్రంలో రోజుకీ కొన్ని వేల మందికి ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుంది. మరోవైపు బాధితులను తొందరగా గుర్తించడానికి టెస్టుల సామర్థ్యాన్ని దగ్గరుండి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.NIV Pune to approve Covid-19 testing kits made by Indian companies ...చాలా వరకు వీలైనన్ని ఎక్కువ పరీక్షలు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. అలాగే వివిధ దేశాలలో జరుగుతున్న వైద్య విధానాల పై పరిశీలన కూడా చేస్తోంది. అన్ని విధాలా వైద్య సదుపాయాలు కల్పించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగే వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ఎక్కువ బెడ్లు కేటాయిస్తూ వివిధ ఆసుపత్రులను.. కరోనా వైరస్ హాస్పిటల్స్ గా మారుస్తూ నిత్యం వారికి సేవలందించడానికి రెడీ అవుతోంది.

 

ఇలాంటి టైమ్ లో పరీక్షలో ఎక్కువ జరిగితే మంచిదా లేకపోతే లిమిట్ లో పరీక్షలు జరిపితే మంచిదా అన్న చర్చ ప్రజలలో జరుగుతోంది. ఎక్కువ పరీక్షలు జరిపితే త్వరగా రోగిని గుర్తించి చాలా వరకూ వైరస్ ను కట్టడి చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. లిమిట్ లో చేస్తే అనగా వైరస్ వచ్చిన టైమ్ లోనే రోగిని గుర్తిస్తే అప్పటికే ఆ రోగి వల్ల చాలా మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని… కాబట్టి పరీక్షలు పెంచితేనే రాష్ట్రంలో వైరస్ కంట్రోల్ అవుతుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news