ఆంధ్రప్రదేశ్ ‘తలరాత’ ఇంతే నా ??

-

కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసి పోరాడుతున్నారు. శత్రువులు ప్రతిపక్షాలు అనేవి లేకుండా ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం కలసి పని చేస్తున్నారు. భయంకరమైన ఈ మహమ్మారిని ఎదుర్కొనటం కోసం ఒకరికి ఒకరు సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ పెద్ద యుద్ధమే చేస్తున్నారు. మన దేశంలో కూడా చాలా రాష్ట్రాలలో అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసి కరోనా వైరస్ పై పోరాడుతున్నాయి. ఇటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీలు కరోనా వైరస్ ని అడ్డంపెట్టుకుని పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్న చేష్టల పట్ల విమర్శలు భయంకరంగా వస్తున్నాయి.Jagan and Naidu kick off Andhra Assembly session with potshots ...ఒకవైపు కరోనా వైరస్ భయంకరంగా వ్యాప్తి చెందుతుంటే మరోపక్క అధికార పార్టీ నాయకులు చేస్తున్న అత్యుత్సాహం పనులు ఇంకా విమర్శలకు దారి తీశాయి. లాక్ డౌన్ సమయంలో పేదలకు సహాయం అంటూ వైసీపీ నాయకులు ప్రజలను సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారో, లేదో అనే తేడా లేకుండా, గుంపులు గుంపులుగా రాణిస్తూ వ్యవహరించడం తో వైరస్ రాష్ట్రంలో వ్యాప్తి చెందటానికి ఒక కారణమని విమర్శలు వచ్చాయి. ఇదే సందర్భంలో ప్రతిపక్షాలు కూడా పెద్దగా స్పందించకుండా కనీసం ప్రభుత్వానికి సూచనలు కూడా ఇవ్వకుండా విమర్శలు చేశాయి.

 

ఈ పరిణామాలతో ఏపీ జనాలంతా దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో అధికార ప్రతిపక్షాలు కలిసి పని చేస్తుంటే ఖర్మ కొద్దీ, తలరాత కొద్దీ వీళ్లు మాత్రం మా బతుకు లతో పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని తెగ అసహనం చెందారు. ఈ అంశం మీద జనాలు ఇంకా ముందుకి వెళుతూ కరోనా వైరస్ రాష్ట్రంలో విజృంభిస్తుంటే ఏపీ రాజకీయ నాయకులు మాత్రం… బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా ప్రజల ప్రాణాలతో రాజకీయాలు చేశారని విమర్శలు భయంకరంగా వస్తున్నాయి. ఇటువంటి రాజకీయ నాయకులు, పార్టీలు ఉన్నంతవరకు ఏపీ అభివృద్ధి చెందే అవకాశం ఉండదని కూడా అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news