సోషల్ మీడియా జనాలకు ఎంత ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిందే. కానీ కొందరు ప్రబుద్ధులు మాత్రం దాన్ని ఫేక్ వార్తలను ప్రచారం చేయడానికే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలోనైతే సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు బాగా వస్తున్నాయి. దీంతో జనాలకు అసలు వార్త ఏదో, ఫేక్ వార్త ఏదో నమ్మబుద్ది కావడం లేదు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చనిపోయాడంటూ… ఓ ప్రబుద్ధుడు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టాడు. అయితే అది ఫేక్ వీడియో అని తేలింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చనిపోయారంటూ.. టిక్‌టాక్‌లో ఓ వ్యక్తి ప్రచారం మొదలు పెట్టాడు. అందులో ఓ వీడియోను కూడా అతను ఉంచాడు. ఆ వీడియోలో అమితాబ్ బచ్చన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా ఉంది. అనంతరం ఓ వాహనంలో అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ దిగుతూ కనిపిస్తున్నాడు. దీంతో ఆ వీడియోను చాలా మంది నిజమే అని నమ్మారు. అమితాబ్ నిజంగానే చనిపోయాడని అనుకున్నారు. ఇటీవలే బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు ప్రముఖ నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషికపూర్‌లు చనిపోయిన నేపథ్యంలో… అమితాబ్ కూడా చనిపోయి ఉంటారని చాలా మంది జనాలు నమ్మారు. కానీ ఆ వార్త ఫేక్ అని తేలింది.
@SrBachchan Sir this @TikTok_IN user @_its.aadiiii_official has uploaded fake video of your death. I had lodge an fir against him in cyber crime. Please you do take strict action against him. He has hurt our sentiments. I want his id to be banned pic.twitter.com/kdgWidXqFP
— ANKUR SETHI (@ANKURBIHARIDAAS) May 2, 2020
@SrBachchan Fir against that fake video creator on tiktok in cybercrime https://t.co/OrhP0t8OYM pic.twitter.com/UFKKLKlzWy
— ANKUR SETHI (@ANKURBIHARIDAAS) May 2, 2020
ఇక ఆ వీడియోపై ఓ వ్యక్తి స్పందించి సైబర్ క్రైం పోలీసులకు కంప్లెంయింట్ చేశాడు. అనంతరం తన ఫిర్యాదు పత్రాన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు. అలాగే ఆ వీడియోను పోస్ట్ చేసిన టిక్‌టాక్ యూజర్‌పై చర్యలు తీసుకోవాలని, అతన్ని అరెస్టు చేయాలని, అతని ఐడీని బ్లాక్ చేయాలని.. కంప్లెయింట్ ఇచ్చిన వ్యక్తి ట్విట్టర్లో కోరాడు. దీంతో ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.