కోతుల కోసం.. 32 ఎకరాల భూమిని రాసిచ్చారట.. అక్షరాల లక్షలు విలువ చేసే ఆస్తి వానరుల సొంతం..!!

-

ఇళ్ల మధ్య, పొలంలో కోతులు వస్తేనే మనం ఊరుకోం.. ఆగం ఆగం చేస్తున్నాయి.. వాటి భయపెట్టి వెళ్లగొడతాం..కానీ అక్కడ ఏకంగా కోతుల పేరిట ఆస్తులు రాసిచ్చారు. కుక్కలు, పిల్లుల మీద ఆస్తి రాయడం మనం వినే ఉంటాం.. ఇప్పుడు కోతుల వంతు వచ్చింది. మహారాష్ట్రలోని ఓ గ్రామంలో కోతుల పేరిట 32 ఎకరాల భూమి ఉంది. సెంటు భూమికోసమే కొట్టుకుసచ్చే ఈరోజుల్లో ఏకంగా ఇంత భూమిని కోతుల పేరిట రాయడమేంటి..? ఎందుకు ఇలా చేశారు..?

కోతులకు మర్యాద..

మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలోని ఉప్లా గ్రామంలో సిమియన్ వర్గానికి (Simian Residents) చెందిన వారు నివసిస్తున్నారు. వీళ్లు పూర్వీకుల నుంచి కోతులను గౌరవిస్తారు. ఇప్పటికీ ఇంటి వద్దకు కోతులు వచ్చినప్పుడు ఎవ్వరూ ఆహారం ఇవ్వకుండా తిరస్కరించరు. అందరూ కచ్చితంగా కోతులకు తినేందుకు ఏదో ఒకటి ఇస్తారు. అంతే కాకుండా గ్రామంలో వివాహాలు, ఇతర వేడుకల సందర్భాల్లో కోతులను ప్రత్యేకంగా గౌరవించి, బహుమతులు కూడా అందిస్తారు.

రికార్డుల్లో కోతుల పేరిట భూమి

ఉప్లా గ్రామ పంచాయతీలో గుర్తించిన భూ రికార్డుల్లో 32 ఎకరాల భూమి గ్రామంలో నివాసం ఉంటున్న అన్ని కోతుల పేరిట రాసి ఉంది. 32 ఎకరాల భూమి కోతులకు చెందినదని పత్రాల్లో స్పష్టంగా ఉందని గ్రామ సర్పంచ్ బప్పా పడ్వాల్ తెలిపారు. అయితే జంతువుల కోసం ఈ నిబంధనను ఎవరు తీసుకొచ్చారో భూమిని ఎప్పుడు రాశారో వారికి తెలియదట.

ఆచారాల్లో భాగంగా కోతులు..

గతంలో గ్రామంలో నిర్వహించే అన్ని ఆచారాలలో కోతులు భాగంగా ఉండేవని సర్పంచ్‌ తెలిపారు. ఇప్పుడు గ్రామంలో దాదాపు 100 వరకు కోతులు ఉంటాయని ఆయన వెల్లడించారు… జంతువులు సాధారణంగా ఒకే చోట ఎక్కువ కాలం ఉండవు కాబట్టి, కాలక్రమేణా గ్రామంలో ఉండే కోతుల సంఖ్య తగ్గిపోయిందని బప్పా పడ్వాల్ వివరించారు. ఆ 32 ఎకరాల భూమిలో అటవీశాఖ మొక్కలు నాటే పనులు చేపట్టింది..కోతుల పేరిట రాసిన ఈ భూమిని ఇప్పటి వరకు ఎవరూ కబ్జా చేయకపోవడం విశేషం. నిజంగా ఇంట్రస్టింగ్‌గానే ఉంది కదా..!

Read more RELATED
Recommended to you

Latest news