కొబ్బరి సాగులో అధిక దిగుబడినిచ్చే రకాలు ఇవే..!

-

కొబ్బరి తోటలు మన తెలుగు రాష్ట్రాల్లో కోస్తాలో ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి తోటలు కేవలం ఓ పంట మాత్రమే కాదు. అది తెలుగు ప్రజలకు ఒక ఎమోషన్. ఎందుకంటే ప్రతి ఏడాది వేసవి రాగానే కుటుంబంతో సహా కొబ్బరి తోటకు వెళ్లి అక్కడ ఓ రోజంతా సరదాగా గడుపుతుంటారు. అందరూ కలిసి భోజనం వండుకుని, కలిసి తిని, ఫ్యామిలీ టైమ్ ను హ్యాపీగా స్పెండ్ చేస్తారు. అక్కడికక్కడే కొబ్బరి కాయలు కోసుకుని కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. పిల్లలు పచ్చికొబ్బరి కోసం పోటీపడి మరీ తింటూ ఉంటారు. ఆ కొబ్బరి చెట్ల కింద పిల్లలంతా కలిసి ఆడుకుంటుంటే వాళ్లని చూస్తూ పెద్దలు సంతృప్తి చెందుతుంటారు. అందుకే మన తెలుగు ప్రజలకు కొబ్బరి చెట్లు అనేవి ఒక ఎమోషన్.

ఏపీలో కొబ్బరి సాగు దాదాపు ఒక లక్ష ఇరవై రెండు వేల హెక్టార్లలో సాగు చేస్తూ దేశంలోనే నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఉత్పాదకతలో మాత్రం మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఉభయగోదావరి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో కొబ్బరి సాగు చేస్తున్నారు. కొబ్బరి సాగు చేపట్టిన రైతులకు దాదాపు 50 సంవత్సరాల పాటు దిగుబడి వస్తూనే ఉంటుంది. అందుకే కొబ్బరి సాగును ప్రారంభిస్తున్న రైతులు మన ప్రాంత వాతావరణానికి అనువైన అధిక దిగుబడినిచ్చే రకాలను ఎన్నుకోవడం చాలా ముఖ్యం.

ఉత్పాదకతలో ఏపీ మొదటిస్థానంలో ఉండటానికి కారణం ఆ ప్రాంతానికి అనువైన అధిక దిగుబడినిచ్చే కొబ్బరి రకాలను సాగు చేయడం. ఇంతకీ ఏ కొబ్బరి సాగుకు ఎలాంటి వాతావరణం అనుకూలమైనది. ఏ రకం కొబ్బరి అధిక దిగుబడిని ఇస్తుంది చూద్దాం.

గౌతమి గంగ : ఇది హైబ్రిడ్ రకం దీనిని అంబాజీపేట ఉద్యాన పరిశోధనాస్థానం వారు రూపొందించి గోదావరి గంగ అను పేరుతో మన రాష్ట్రంలో సాగునకు 1991 లో విడుదల చేయబడినది. ఈ హైబ్రిడ్ రకం నాలుగు సంవత్సరాలకు కాపు కొచ్చి 6-7సంవత్సరాలలో మంచి దిగుబడినిచ్చుట ప్రారంభిస్తుంది. సగటున ఈ హైబ్రిడ్ మొక్క నుంచి150 కాయల దిగుబడిని పొందవచ్చు.

ఈస్ట్ కోస్ట్ టాల్ : ఇది దేశవాళీ రకానికి చెందినది. ఈ రకాన్ని తూర్పు కోస్తా ప్రాంతంలో విస్తారంగా సాగు చేస్తున్నారు. నాటిన ఏడు సంవత్సరాలకు కాపుకొచ్చి సగటున ఒక్క కాపు కి 80 నుంచి 100 కాయల దిగుబడిని పొందవచ్చు.

డబుల్ సెంచరీ: ఈ రకం తూర్పు తీర ప్రాంతానికి అనువైనదిగా ఉండి అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. దేశవాళి రకానికి అంటే అధిక దిగుబడి ఇచ్చే పొడుగు రకం. డబుల్ సెంచరీ రకం నాటిన ఏడు సంవత్సరాలకు కాపుకొచ్చి సగటున ఒక్కసారి 140 కాయలను ఇస్తుంది.ఈ కాయల్లో అత్యధికంగా 64% నూనె కలిగి ఉంటుంది.

గౌతమి గంగ : అత్యధిక నీరు ఉండే కొబ్బరి బొండాలకు ప్రసిద్ధి గాంచిన రకం. కోనసీమ ప్రాంతంలో అత్యధికంగా సాగు చేస్తున్నారు.నాటిన మూడు నుండి నాలుగు సంవత్సరాలకే కాపుకు వచ్చి ఒక్కసారి సగటున 90 కాయల అధిక దిగుబడి నిస్తుంది. ఈ చెట్లు పొట్టిగా ఉండి కాయలను కోయడానికి సులువుగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version