రసాయనిక ఎరువులతో భూసారం పూర్తిగా తగ్గిపోతుంది..దాంతో అందరూ సేంద్రీయ ఎరువుల వైపు మొగ్గు చూపిస్తున్నారు..వాటి వల్ల భూసారం పెరగడం మాత్రమే కాదు..మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..పశువుల ఎరువుల లభ్యత తక్కువ ఉన్న ప్రదేశాలలో ఈ పచ్చిరొట్ట ఎరువును ప్రత్యామ్నాయంగా వేసి నేలలో కలియదున్నడం వలన భూసారాన్ని పెంపొందించవచ్చు. తొలకరి వర్షాలకు పచ్చిరొట్ట ఎరువుల సాగుకు సరైన సమయం. జనుము, జీలుగ, పెసర, మినుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట ఎరువులను సాగు చేయడం వలన భూసారాన్ని పెంచవచ్చు..పంటకు పోషకాలు కూడా ఎక్కువగా వుంటాయి……………..
25-30% నత్రజని ఎరువుల వాడకంని తగ్గించుకోవచ్చు. కలుపు మొక్కలను అరికట్టవచ్చు.లాభదాయక సూక్ష్మజీవుల సంఖ్య నేలలో పెరుగును సేంద్రియ పదార్థంను నేలకు అందిస్తుంది.నేల భౌతిక, రసాయనిక ధర్మాలు మెరుగుపడతాయి.లోతైన వేరువ్యవస్థ కల్గివుండడం వల్ల నేలలోపలి పొరలలోని పోషకాలను మొక్కకు అందేలా చేస్తుంది. చౌడు నేలలను పునరుద్ధరించవచ్చు.
తొలకరి వర్షాలు పడిన సమయంలో ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసుకుని పూత దశలో అనగా 45-50 రోజుల సమయంలో కలియదున్నాలి. లేనిచో కాండం గట్టిపడి నేలలో కలియదున్నిన తర్వాత సరిగా కుళ్లిపోదు. పచ్చిరొట్ట ఎరువు 2-3 వారాల పాటు నేలలో కుళ్ళనివ్వాలి..అలా లేని పక్షంలో వేప,వెంపలి మొక్కల యొక్క లేత ఆకులను, కొమ్మలను 2-3 పచ్చిరొ టన్నులు ఎకరాకు వేసి కలియదున్నవలెను.ఒక్కోక్కటి ఒక్కో సమయంలో నేలలో దున్నెయ్యాలి..
ఎరువుల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు………………………
తేమ చాలని ప్రాంతాల్లో వేసవిలో దుక్కి దున్ని తొలకరి వర్షాలు పడగానే విత్తుకోవాలి.. నీటి వసతి గల ప్రాంతాల్లో వేసవిలో సాగు చేయడం లాభదాయకం. వరి, చెరకు పంటల సరళిలో రెండు పంటల మధ్యకాల ‘వ్యవధిలో విత్తుకొని కలియదున్నవచ్చు..సాధారణంగా పచ్చిరొట్ట పైర్లు చల్లుకునేటపుడు అధిక మోతాదు విత్తనం ఉపయోగించిన మొక్కలు తక్కువ ఎత్తు పెరిగి రసవంతంగా ఉంటాయి..లేకుంటే పక్షంలో జీలుగ వంటి పచ్చిరొట్ట ఎరువులు మొక్క ఎత్తు పెరిగి కాండంలో పీచుగా మారి మట్టిలో కలవడానికి ఎక్కువ సమయం పడుతుంది..