క్వింటాల్ మిర్చికి రూ. 52 వేలు… దేశ చరిత్రలోనే ఇదే రికార్డ్

-

ఎర్రబంగారం సిరులు కురిపిస్తోంది. మిర్చికి రికార్డ్ ధరలు పలుకుతున్నాయి. ఏకంగా పసిడి ధరతో పోటీ పడుతోంది. గత కొన్ని రోజుల క్రితం క్వింటాల్ మిర్చికి రూ. 40 వేలకు పైగా ధర పలికిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రికార్డ్ ధర పలికింది. వరంగల్ ఎనమామూల మార్కెట్ లో మిర్చికి రికార్డ్ ధర లభించింది. క్వింటాల్ దేశీ మిర్చికి రూ. 52,000 ధర పలికింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన ధరల్లో ఇదే ఆల్ టైం రికార్డ్ ధర. దేశ చరిత్రలోనే ఇదే రికార్డ్ ధర అని అధికారులు తెలుపుతున్నారు. దేశీ మిర్చితో పాటు సింగిల్ పట్టి రకానికి కూడా రికార్డ్ స్థాయిలో ధర పలుకుతోంది. 

ఈ ఏడాది అకాల వర్షాలు, చీడపీడల వల్ల దిగుబడి చాలా తగ్గింది. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో మిర్చికి డిమాండ్ ఏర్పడటంతో ధరలు పెరుగుతున్నాయి. గతంతో ఈ రేటును ఎప్పుడూ చూడలేని రైతులు, అధికారులు అంటున్నారు. గతేడాది ఇదే సమయంలో కేవలం రూ. 26 వేలు పలికిన మిర్చికి … ఈ ఏడాది మాత్రం రూ. 50 వేలకు పెరిగింది. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గిట్టుబాటు ధర లభిస్తోందని రైతులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version