డియర్ లేడీస్.. ఈ టిప్స్‌ మీకోసమే.. వర్షాకాలంలో మేకప్‌ విషయంలో జరభద్రం..!!

-

వర్షాకాలం అంటే రోగాల కాలం అని చెప్పుకోవచ్చు. వాతావరణం కూల్‌గా ఉంటుందన్నమాటే కానీ.. రోడ్లన్నీ జలమయం..పారే నీళ్లు..పొంగే వరదలు.. కూలే ఇళ్లు..వచ్చే జబ్బులు..జాగ్రత్తగా ఉండకపోతే పోయే ప్రాణాలు..అబ్బో మొత్తం ఆగం ఆగం ఉంటుంది ఈ సీజన్‌ అంతా..చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ దగ్గు జలుబులు..ఇంట్లోంచి బయటకురాగానే శత్రుసైన్యం దాడిచేసినట్లు చేసే వాన..ఈ సీజన్‌ అయిపోయేలోపు ఒక్కసారైనా వానలో తడవకుండా ఉండలేమేమో కదా..! బయటకు వెళ్లే వాళ్లు ఏదో రోజు వానకు బుక్ అవ్వాల్సిందే..! ఇలాంటప్పుడే చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి..లేదంటే స్కిన్‌ ఎలర్జీలు వచ్చే అవకాశం లేకపోలేదు.. కొన్ని జాగ్రత్తలు ద్వారా ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా ఈ కాలాన్ని గట్టేక్కించవచ్చు.. అవేంటంటే..

ఈ కాలంలో చర్మం వాతావరణం నుంచి అవసరానికి మించి తేమను గ్రహిస్తుంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని, మీ చర్మ రకాన్ని బట్టి తేలికైన మాయిశ్చరైజర్‌ను వాడండి. చాలా ఎక్కువగా చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసే సిరామైడ్ మాయిశ్చరైజర్లను ఉపయోగించొద్దు..అందుకు బదులుగా తేలికపాటి జెల్ ఆధారిత ప్రొడక్ట్స్ వాడాలి.

ఈ కాలంలో చర్మ రంధ్రాలు మూసుకుపోయే అవకాశమెక్కువ. అందుకే తేమను తొలగించడానికి కొంచెం బలమైన ఫేస్‌వాష్ ఉపయోగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

గ్లైకోలిక్, సాలిసిలిక్ యాసిడ్ ఫేస్‌వాష్‌లు మొటిమల బారినపడే చర్మానికి బాగా పనిచేస్తాయి. గ్లుటాతియోన్ (Glutathione) గల ఫేస్‌వాష్ కాంబినేషన్ కూడా చర్మానికి మంచి చేస్తుంది.

ఈ సీజన్‌లో ఎండలు ఎక్కువగా బాధించవు కానీ చర్మాన్ని రక్షించుకోవాలంటే సన్‌స్క్రీన్లు తప్పక వాడాల్సిందే. పౌడర్ లేదా జెల్ ఆధారిత సన్‌స్క్రీన్లు ఈ కాలంలో చర్మాన్ని బాగా కాపాడుతుంది.. వర్షాకాలంలో వాటర్‌ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్ సన్‌స్క్రీన్‌ని వాడటం ఉత్తమం.

ఈ కాలంలో ఎక్స్‌ఫోలియేటివ్ స్క్రబ్‌లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మ రకాన్ని బట్టి ఎక్స్‌ఫోలియెంట్లను వాడవచ్చు. వీటితో డెడ్ స్కిన్‌ను వదిలించుకోవచ్చు.

వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రకరకాల ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, స్కిన్ అలెర్జీలు, తామర వంటి సమస్యలు తలెత్తుతాయి. బాగా చెమట పోసే శరీరభాగాల్లో చర్మ సమస్యలు వచ్చే అవకాశమెక్కువగా ఉంటుంది.. అందుకే ఈ శరీరభాగాలకు ప్రతిరోజూ రెండుసార్లు మంచి యాంటీ ఫంగల్ డస్టింగ్ పౌడర్‌ను రాసుకోవాలి.

మేకప్‌ మంచిదేనా..?

వర్షాకాలంలో మేకప్ ఎంత తక్కువగా వేసుకుంటే అంత మంచిది. హెవీ కన్సీలర్లు లేదా ప్రైమర్లను ఉపయోగిస్తే ఇబ్బందులు తప్పవు. ఈ కాలంలో ఏ మేకప్ ప్రొడక్ట్స్ అయినా సరే చాలా తేలికైనవి వాడాలని గుర్తుపెట్టుకోండి.

ఐలైనర్ల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కాబట్టి వాటర్‌ప్రూఫ్‌ ఐలైనర్లు ఉపయోగిస్తే బెటర్. వాటర్‌ప్రూఫ్‌ ఐలైనర్లు అయినా ఈ కాలంలో వీటిని ఎక్కువసేపు కళ్లపై ఉంచుకోకుండా మైకెల్లార్ వాటర్ క్లెన్సర్లు, ప్యాడ్‌లను ఉపయోగించి తొలగించడం మంచిది. లేదంటే వానలో తడవగానే కళ్లకు వేసిన ఐలైనర్ కారిపోయి ఆగం ఆగం అవుతుంది.

యాంటీ ఏజింగ్ కోసం రాత్రి పడుకునే ముందు సిరమ్స్‌ వాడితే మంచిది. విటమిన్‌ సీ సిరమ్‌ వాడటం వల్ల ఫేస్‌ గ్లోయింగ్‌ ఉంటుంది. ముఖం పై ఉన్న మచ్చలు పోతాయి. ముడతలు రావు. కాస్త నాణ్యమైనది ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Exit mobile version