Business Ideas : ఉప్పు హోల్‌సేల్‌గా కొని అమ్మితే.. చ‌క్క‌ని లాభాలు..!

మ‌నం నిత్యం ఏ వంట‌కాన్ని చేసుకుని తిన్నా స‌రే.. అందులో క‌చ్చితంగా ఉప్పు ఉండాల్సిందే. ఉప్పు లేక‌పోతే వంట‌కాల‌కు రుచి రాదు. క‌నుక ప్ర‌తి ఒక్క‌రూ ఉప్పును క‌చ్చితంగా వాడుతారు. ఇది మ‌న నిత్యావ‌స‌రాల్లో ఒక‌టిగా మారింది. అయితే ఉప్పును హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి దాన్ని ప్యాక్ చేసి అమ్మితే.. దాంతో మ‌నం ఎక్కువ లాభాలు సంపాదించ‌వ‌చ్చు. మ‌రి ఈ బిజినెస్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఉప్పును హోల్‌సేల్‌గా కొనాలంటే వ్యాపారుల వ‌ద్ద‌కే వెళ్లాల్సిన ప‌నిలేదు. ఇండియామార్ట్ వంటి వెబ్‌సైట్ల‌లోనూ మ‌న‌కు ఉప్పు హోల్‌సేల్‌గా ల‌భిస్తుంది. ఇక ఉప్పును ప్యాక్ చేసేందుకు కావ‌ల్సిన ప్రింటెడ్ క‌వ‌ర్లు కూడా అదే సైట్‌లో మ‌న‌కు ల‌భిస్తాయి. వాటిని కూడా మ‌నం ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. అలాగే బ‌రువు తూచే వెయింగ్ మెషిన్‌.. ఉప్పును ప్యాక్ చేశాక క‌వ‌ర్‌ను సీల్ చేసే మెషిన్‌ల‌ను కూడా మ‌నం కొనాలి. వీటిని ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఇక ఉప్పును హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి ప్యాక్ చేసి అమ్మ‌డం వ‌ల్ల ఎంత ఖ‌ర్చ‌వుతుంది.. ఎంత లాభం వ‌స్తుంది.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు ప‌రిశీలిద్దాం. సాధార‌ణంగా ఇండియా మార్ట్ వెబ్‌సైట్‌లో మ‌న‌కు 1కిలో ఉప్పు రూ.1కే ల‌భిస్తుంది. అలాగే ప్యాకింగ్ కాస్ట్ రూ.0.50 అవుతుంది. లేబ‌ర్‌, మార్కెటింగ్‌కు మ‌రో రూ.2 అవుతుంది. ఈ క్ర‌మంలో 1 కేజీ సాల్ట్ ప్యాకెట్ ఉత్ప‌త్తికి రూ.3.50 వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. ఇక ఆ ప్యాకెట్‌ను హోల్‌సేల్‌గా రూ.8కి అమ్మ‌వ‌చ్చు. దీంతో 1 కేజీ ప్యాకెట్‌కు రూ.4.50 లాభం వ‌స్తుంది. ఇలా ఉప్పు ప్యాకెట్ల‌ను త‌యారు చేసి విక్ర‌యించ‌వ‌చ్చు.

ఉప్పు ప్యాకెట్ల‌ను పెద్ద మొత్తంలో స‌ర‌ఫ‌రా చేయాలంటే.. కిరాణా షాపులు, సూప‌ర్ మార్కెట్లు, హోట‌ల్స్, రెస్టారెంట్లు, హోల్‌సేల్ వ్యాపారుల‌తో టై అప్ అవ్వాలి. దీంతో పెద్ద మొత్తంలో ఉప్పు ప్యాకెట్ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌వ‌చ్చు. ఆ మేర లాభాల‌ను కూడా ఆర్జించ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు.. రోజుకు 100 షాపుల‌కు 10 ప్యాకెట్ల చొప్పున స‌ర‌ఫ‌రా చేస్తే.. 1000 ప్యాకెట్లు అవుతాయి. అదే నెల‌కు 30వేల ప్యాకెట్లు అవుతాయి. దీంతో నెలకు రూ.1.35 ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చు. ఇలా ఆదాయాన్ని లెక్కించ‌వ‌చ్చు..!