బిజినెస్ ఐడియా: అదిరిపోయే లాభాల కోసం ఈ కోళ్ల పెంపకం చెయ్యండి..!

-

మీరు ఏదైనా బిజినెస్ ని చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఒక మంచి ఐడియా. ఈ బిజినెస్ చేస్తే మంచి లాభాలు పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. రాజశ్రీ కోళ్ల పెంపకం చేస్తే అదిరిపోయే లాభాలని పొందొచ్చు.

కోళ్ల పెంపకం

ఈ కోళ్లను పెంచడానికి బయట ఎక్కడో ఫారం అక్కర్లేదు. ఇంటి పెరట్లోనే పెంచవచ్చు. ఈ వ్యాపారానికి ప్రభుత్వాలే గ్రామాల్లో ఉండే వారిని ప్రోత్సహిస్తున్నాయి. ఈ కోళ్ల వలన బిజినెస్ ఈజీగా ఉంటుంది. కోడి పుంజుల్లా మరీ పెద్దగా పెరగవు ఈ కోళ్లు. అలాగని ఫారం కోళ్లలా చిన్నగా ఉండవు. పైగా ఇవి పెట్టే గుడ్ల బరువు నాటు కోడి గుడ్డు బరువు కంటే ఎక్కువగా ఉంటుంది.

మామూలు కొళ్ళైతే మొదట గుడ్డు పెట్టడానికి 7 నెలలు పడుతుంది. అదే రాజశ్రీ కోడి అయితే 5 నెలల తర్వాత పెడుతుంది. నాటుకోళ్లు 17 నెలల్లో సుమారు 60 గుడ్లు పెడతాయి. అదే రాజశ్రీ కోడి అయితే 17 నెలల్లో మాగ్జిమం 160 గుడ్లు పెడతుంది.

వీటికి ఆహారంగా మొదట్లో లేయర్ కోడి పిల్లలకు ఆరంభంలో ఇచ్చే దాణానే వీటికీ ఇవ్వాలి. ఆ తర్వాత పచ్చగడ్డి తో పాటు కిచెన్‌లో వ్యర్థాలు, వివిధ రకాల గింజ ధాన్యాలు, నూకలు వంటివి ఇవ్వొచ్చు. ఈ కోడి కేజీ ధర మార్కెట్‌లో రూ.500 దాకా పలుకుతోంది. ఇక ఇంట్లోనే ఈ వ్యాపారం చేసి మంచి రాబడి పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news