ఆర్‌.ఆర్‌.ఆర్ ఆల‌స్యానికి కార‌ణం అదా…?

-

బాహుబలి సినిమాతో రాజమౌళి బ్రాండ్ ఇండియా వైడ్ గా పాపులర్ అయింది. తన సినిమాకి బాలీవుడ్ తారలు లేకుండా పాన్ ఇండియా అప్పీల్ రాదనీ భయపడ్డాడు. అందుకే తీసేది తెలుగు స్టార్స్ తో మల్టీస్టారర్ సినిమా అయినా హిందీ తారలను కూడా తన సినిమాలో పెట్టుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి ప్లానింగ్ ని ఇదే దెబ్బకొట్టింది.

ఆర్.ఆర్.ఆర్ ఆలస్యం అవడానికి కారణం బాలీవుడ్ నటులే అంట. అలియా భట్ ఫుల్ బిజీగా ఉండడంతో ఆమె డేట్స్ అసలు దొరకడం లేదు. దాంతో ఆమె పాత్రని కుదించారని తెలుస్తుంది. ఇక అజయ్ దేవగన్ తన హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. హిందీ సినిమాని పక్కన పెట్టి దీనికి డేట్స్ ఇవ్వడం లేదు. దాంతో అతనికోసం జనవరి వరకు వేచి చూడక తప్పదు.

తమకు అనుకూలమైన టైం లోనే డేట్స్ ఇస్తున్నారు బాలీవుడ్ తారలు. దాంతో ఆర్.ఆర్.ఆర్ ఏడాదికి పైగా ఆలస్యం కానున్నదని అంటున్నారు. రాజమౌళి సినిమాలు ఏవి అనుకున్న సమయానికి పూర్తి కావు. కానీ, పకడ్బందీ వ్యూహంతో వెళ్ళాడు. అయినప్పటికీ బాలీవుడ్ నటుల రూపంలో అతని ప్రణాళిక మొత్తం రివర్స్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news