జగపతి బాబును ఫాలో అవుతున్న శ్రీకాంత్.. మరి సక్సెస్ అవుతాడా!

-

హీరో శ్రీకాంత్ ఒక‌ప్పుడు ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను అందుకున్నాడు. చిరంజీవి త‌ర్వాత ఇండ‌స్ట్రీలో ఒంట‌రిగా ఎదిగింది శ్రీకాంత్ అనే చెప్పాలి. త‌న ట్యాలెంట్ తో ఎన్నో సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. మైటీస్టార్‌గా ఎదిగాడు. త‌న‌కంటూ ప్ర‌త్యేక ఫ్యామిలీ అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ‌శ్రీకాంత్ సినిమా అంటే ఒక వ‌ర్గం ప్రేక్ష‌కులు ఇప్ప‌టికీ ఆద‌రిస్తారు. మొద‌ట్లో నెగెటివ్ పాత్ర‌లు చేసి.. ఆ త‌ర్వాత హీరోగా నిరూపించుకున్నాడు.

అయితే శ్రీకాంత్ కెరీర్ ఇప్పుడు అంత గొప్పగా లేదు. ఇంతకు ముందులా హీరోగా అవకాశాలు తగ్గాయి. దీంతో శ్రీకాంత్ జగపతి బాబును ఫాలో అవుతున్నాడు. జగపతి బాబు కూడా కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఎవరూ ఊహించని విధంగా మలుపు తిరిగింది. నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాలో జగపతి బాబు విలన్ నటించి మెప్పించారు. అంతే ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు ఎంతో అద్భుతమైన పాత్రలు చేస్తూ హీరోలకి సమానంగా మళ్ళీ క్రేజ్ సంపాదించుకోగలిగాడు.
ఇదే విధంగా ఇప్పుడు శ్రీకాంత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు. బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్న ‘అఖండ’ సినిమాలో శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ క్యారెక్టర్‌తో శ్రీకాంత్ మరో కోణంలో కనిపించడానికి తనను తాను రెడీ చేసుకుంటున్నాడు. ఈ సినిమాతో తన కెరీర్ మళ్లీ పట్టాలెక్కుతుందని ఆయన భావిస్తున్నారు. ఇంతకు ముందు కూడా పలు సినిమాల్లో నటించినా అవి ఇలా వేరియెంటెడ్ పాత్రలు కావు. కానీ ఈ సారి పూర్తి నెగెటివ్ రోల్ లో శ్రీకాంత్ నటించనున్నట్టు సమాచారం. చూడాలి మరి శ్రీకాంత్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news