టాలీవుడ్‌ను కుదిపేస్తున్న కొవిడ్‌.. నిబంధ‌న‌ల మేర‌కు షూటింగులు

-

కొ‌విడ్ -19 ఫ‌స్ట్ వేవ్ టాలీవుడ్ ను కుదిపేసింద‌నే చెప్పాలి. దీని నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే సినీ ఇండ‌స్ట్రీ కుదుట డుతుంద‌నుకుంటే.. మ‌ళ్లీ సెకండ్ వేవ్ అత‌లాకుత‌లం చేస్తోంది. ఆన్ లొకేషన్ ఆర్టిస్టులు సిబ్బంది క‌రోనా భారిన పడుతుండడం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీంతో పెద్ద పెద్ద సినిమాలు సైతం షూటింగ్ ను నిలిపివేస్తున్నాయి. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న షూటింగ్ లు కూడా కొవిడ్ -19 మార్గదర్శకాలను అనుసరిస్తూ జ‌రుపుతున్నారు.


ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 5,000 ఆంధ్రప్రదేశ్లో 7,500 కేసులు న‌మోద‌వుతుండ‌టం థియేటర్ల రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో థియేట‌ర్ల‌కు వ‌చ్చేవారి సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిపోతోంది. ముందుజాగ్రత్తగా పెద్ద బడ్జెట్ సినిమాల‌న్నింటినీ వాయిదా వేస్తుంన్నారంటే ప‌రిస్థ‌తి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అయినప్ప‌టికీ కొన్ని సినిమాల‌ను ధైర్యం చేసి విడుద‌ల చేస్తున్నా.. పెద్ద‌గా క‌లెక్ష‌న్లు రావ‌ట్లేద‌ని చెప్పాలి. ఇలాగే జ‌రిగితే థియేట‌ర్ల‌లో మ‌ళ్లీ 50శాతం ఆక్యుపెన్సీకి త‌గ్గే అవ‌కాశం ఉంది.

ఇవన్నీ సినిమా ప‌నుల‌ను అడ్డుకుంటున్నాయి. ఒక వేళ వ్యాక్సినేష‌న్ స్పీడ్ గా జ‌రిగి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నా.. వాయిదా ప‌డ్డ సినిమాల‌ను రిలీజ్ చేయ‌డం, విడుదల తేదీలను ఖరారు చేయడం పెద్ద స‌మ‌స్యే అని చెప్పాలి. ఇప్ప‌టికే ప‌నుల్లేక జూనియ‌ర్ ఆర్టిస్టులు, అసిస్టెంట్లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమ త్వరలోనే కోలుకుంటుందని అంద‌రం ఆశిద్దాం. అయితే ప్ర‌స్తుతానికి జ‌రుగుతున్న కొన్ని సినిమా షూటింగులు నిబంధ‌న‌ల‌కు లోబ‌డి జ‌రుగుతున్నాయి. ఇలాగా మిగ‌తా వాటిని కూడా కంప్లీట్ చేస్తే ప‌రిశ్ర‌మ‌కు మేలు జ‌రిగిన‌ట్టే.

Read more RELATED
Recommended to you

Latest news