విజ‌య్ సినిమా కూడా వాయిదా ప‌డ‌నుందా..!

-

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు యూత్‌లో ఉన్న క్రేజ్ ఇప్ప‌టి హీరోల‌కు ఎవ‌రికీ లేద‌నే చెప్పాలి. మ‌రీ ముఖ్యంగా అమ్మాయిల‌కు క‌ల‌ల రాకుమారుడిగా మారిపోయాడు. అమ్మాయిలు త‌మ వాట్సాప్ డీపీలుగా విజ‌య్ ఫొటోల‌ను పెట్టుకుంటున్నారు. విజ‌య్ లాంటి అబ్బాయి బాయ్‌ఫ్రెండ్‌గా రావాల‌ని కోరుకుంటుంటారు. విజ‌య్ ఎవ‌రి స‌పోర్టు లేకుండా సొంతం ఎదిగాడు. చాలా త‌క్కువ టైమ్‌లోనే పెద్ద హీరో అయ్యాడు. టాప్ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేస్తూ సౌత్ ఇండియాలో స్టార్ గా ఎదిగిపోయాడు.


ఇద‌లా ఉంటే ఈ మ‌ధ్య తెలుగు ఇండ‌స్ట్రీలో వ‌రుస‌గా సినిమాలు క్యాన్సిల్ అవుతున్నాయి. మొన్న‌టికి మొన్న ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా ఆగిపోయిందని పుకార్లు వినిపించాయి. చివ‌రిక అదే నిజ‌మ‌యింది. ఆ తర్వాత అల్లు అర్జున్‌ – కొరటాల సినిమా కూడా ఇలాగా ఆగిపోయింది. ఇప్పుడు విజ‌య్ విష‌యంలోనూ అలాంటి వార్త ఒక‌టి నిరాశ‌కు గురి చేస్తోంది. ప్ర‌స్తుతం పూరి డైరెక్ష‌న్‌లో లైగ‌ర్ సినిమాతో బిజీగా ఉన్న విజ‌య్ ఈ సినిమాను త్వ‌ర‌గా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
ఇక స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌– విజయ్‌ దేవరకొండ సినిమా ప్రకటించిన విషయం అంద‌రికీ విద‌త‌మే. విజయ్‌ స్నేహితుడు కేదార్‌ నిర్మాణంలో ఈ సినిమా తీస్తార‌ని అప్ప‌ట్లోనే అనౌన్స్ చేశారు. అయితే ఆ తర్వాత ఈ మూవీ గురించి ఎక్కడా చర్చ లేదు. క‌నీసం ఒక అప్‌డే ట్ కూడా రాలేదు. మరోవైపు సుకుమార్‌ ‘పుష్ప’ షూటింగ్‌లోనూ బిజీగా ఉండటంతో వాళ్ల మూవీ గురించి ఎలాంటి వార్త రాలేదు. అయితే ఈ సినిమా వాయిదా ప‌డింద‌నే వార్త‌లు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చక్క‌ర్లు కొడుతున్నాయి.సుకుమార్ రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా చేయ‌బోతున్నాడ‌ని అప్పుడే వార్త‌లు వినిపిస్తున్నాయి. పుష్ప త‌రువాత సుకుమార్ చెర్రీతో సినిమా చేస్తే విజ‌య్ సినిమా ఆగిపోవ‌డం ఖాయ‌మే అని తెలుస్తోంది. చూడాలి మ‌రి ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news