డ్రగ్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది అంటూ హేమ పోస్ట్..!

-

నటి హేమ గురించి తెలియని వారుండరు. సినిమాల విషయంలో అఆమే గురించి అందరికి తెలియకపోయిన.. ఈ మధ్యే జరిగిన బెంగళూరు రేవ్ పార్టీ,డ్రగ్స్ కేసు విషయంలో హేమ అందరికి సుపరిచితురాలు అయ్యిపోయింది. అయితే తాజాగా ఇన్ స్టాలో నటి హేమ ఓ పోస్ట్ చేసింది. అందులో బెంగళూరు డ్రగ్స్ విషయం పై మాట్లాడుతూ… నేను బహిరంగంగా ఎలాంటి టెస్ట్ లు చేయించుకోవడానికి అయినా రెడీ అంటూ పేర్కొంది.

నేను నిరపరాధిని. బెంగుళూరు రేవ్ పార్టీలో వ్యవహారంలో నాపై వచ్చినవి అన్నీ పుకార్లే.నేను డ్రగ్స్ తీసుకోలేదు. డ్రగ్ టెస్ట్ లో నాకు నెగిటివ్ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా. అందుకే ఈ వీడియో చేస్తున్నా. అయితే నన్ను కొందరు నన్ను బ్లాక్ మెయిల్ చేశారు. కానీ నేను దేనికైనా రెడీ అంటూ తాను చేయించుకున్న టెస్ట్ రిపోర్ట్స్ ను ఆ వీడియోలో షేర్ చేసింది హేమ.

Read more RELATED
Recommended to you

Exit mobile version