అడివి శేష్ తో సుప్రియ పెళ్లా..?

-

గూఢచారి సినిమాతో మరోసారి తన సత్తా చాటిన అడివి శేష్ తన ప్రతి సినిమాతో అలరిస్తున్నాడు. కెరియర్ మొదట్లో తన ప్రయత్నాలు విఫలమవగా ఫైనల్ గా క్షణం నుండి అడివి శేష్ హిట్ కొడుతూ వస్తున్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన గూఢచారి సినిమా తక్కువ బడ్జెట్ తో జేమ్స్ బాండ్ తరహా సినిమా తెరకెక్కించారు. అడివి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాను శషి కిరణ్ తిక్క డైరెక్ట్ చేశాడు.

గూఢచారి సినిమాలో అక్కినేని కుటుంబానికి చెందిన యార్లగడ్డ సుప్రియ నటించారు. నాగార్జున మేనకోడలైన సుప్రియ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా తర్వాత సినిమాలు చేయడం ఆపేసిన సుప్రియ గూఢచారి సినిమాలో నటించింది. ఆ సినిమాలో నటించారనో ఏమో కాని అడివి శేష్, సుప్రియా పెళ్లాడుతున్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమధ్యనే త్వరలో ఓ సర్ ప్రైజ్ న్యూస్ చెబుతా అని అడివి శేష్ చెప్పగా అది సుప్రియతో పెళ్లి గురించే అంటూ కొందరు అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news