నేడే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్పెష‌ల్ గెస్ట్ గా స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి

నంద‌మూరి హీరో బాల‌కృష్ణ హీరో గా బోయాపాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం లో వ‌స్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం అఖండ‌. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం హైద‌రాబాద్ లో ని శిల్ప క‌ళా వేదిక లో చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెష‌ల్ గెస్ట్ గా స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి వ‌స్తున్నారు. ఈ విష‌యాన్ని అఖండ సినిమా డైరెక్ట‌ర్ బోయాపాటి శ్రీ‌ను సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇంత వ‌ర‌కు చీఫ్ గెస్ట్ గా ఎవ‌రూ వ‌స్తారో అనే ఉత్కంఠ ఉండేది. ఈ ఉత్కంఠ కు తెర దించుతూ.. డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను త‌న సోష‌ల్ మీడియా ద్వారా నంద‌మూరి అభిమానుల‌కు తెలిపాడు. కాగ బాల‌కృష్ణ, బోయ‌పాటి సెన్సెష‌న‌ల్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం కావ‌డం తో ఈ సినిమా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కాగ ఈ సినిమా లో మొద‌టి సారి హీరో శ్రీ‌కాంత్ ప్ర‌తి నాయ‌కుని పాత్ర లో న‌టిస్తున్నాడు. అలాగే జ‌గ‌ప‌తి బాబు కూడా మ‌రొక పాత్ర లో న‌టిస్తున్నాడు. అలాగే హీరో బాలకృష్ణ కు జంట గా ప్ర‌గ్యా జైస్వాల్ న‌టిస్తుంది.