Alia Bhatt : హాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న మ‌రో బాలీవుడ్ భామ‌

-

బాలీవుడ్ భామ‌లు హాలీవుడ్ కు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ అగ్ర హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఇప్ప‌టికే హాలీవుడ్ లో సెటిల్ అయింది. ఒక్క చిన్న సినిమాతో హాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు వ‌రుస అవ‌కాశాలను కొట్టేస్తుంది. తాజా గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ కూడా హాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుంది. హాలీవుడ్ లో ఇటీవల ప్ర‌క‌టించిన హార్ట్ ఆఫ్ స్టోన్ అనే థ్రిల్ల‌ర్ సినిమాలో ఒక కీల‌క పాత్ర‌కు ఆలియా భ‌ట్ ఛాన్స్ కొట్టేసింది.

ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్ర‌క‌టించింది. కాగ ఈ సినిమాను డేవిడ్ ఎలిస‌న్, గాల్ గ్యాడెట్ తో పాటు ఆమె భ‌ర్త జేర‌న్ వార్స‌నో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగ ఆలియా భ‌ట్ ఇటీవ‌ల గంగూబాయి క‌తియావాడి అనే సినిమాలో టైటిల్ రోల్ లో నిటించింది. ఈ సినిమా ఇటీవ‌ల థీయేట‌ర్ ల‌లో విడుద‌ల అయింది. అయితే ఈ సినిమా భారీ హిట్ కొట్ట‌డంతో.. ఆలియా ప్ర‌పంచ వ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకుంది. దీంతో హాలీవుడ్ దృష్టిలో కూడా ఆలియా భ‌ట్ ప‌డింది. దీంతో ఈ బంప‌ర్ ఆఫ‌ర్ ను ఆలియా భ‌ట్ సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version