ఎన్టీఆర్ కొడుకులను సర్ప్రైజ్ చేసిన అలియా.. తనకు కావాలన్న ఎన్టీఆర్..!

-

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలలో తెలుగు తెరకు పరిచయమైన అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈమె ఎంటర్ప్రైన్యూర్ గా కూడా రాణిస్తోంది. రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది . అయితే పెళ్లికి ముందే 2021లో పిల్లల కోసం ప్రత్యేకంగా కాన్షియస్ క్లాతింగ్ బిజినెస్ ప్రారంభించిన ఆమె తాజాగా ఆర్ఆర్ఆర్ కోస్టార్ జూనియర్ ఎన్టీఆర్ కి సర్ప్రైజ్ ఇచ్చింది. ఎన్టీఆర్ కొడుకులు నందమూరి అభయ్ రామ్, భార్గవ్ రామ్ కోసం కొన్ని బ్యూటిఫుల్ అవుట్ ఫిట్స్ పంపించింది.

అయితే ఈ అవుట్ ఫిట్స్ అబ్బాయిలు భార్గవ్, అభయ్ లకు చాలా నచ్చాయని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసిన తారక్..అలియాకు ధన్యవాదాలు చెబుతూ.. తన కోరికను బయటపెట్టాడు. దీనికి స్పందించిన అలియా ఎన్టీఆర్ ను స్వీటెస్ట్ అంటూ రిప్లై ఇచ్చింది. ఇకపోతే ఎన్టీఆర్ ఏమడిగారు అనే విషయానికి వస్తే.. ఎన్టీఆర్ తన ఇన్స్టా అకౌంట్లో అలియా బ్రాండ్ అవుట్ ఫిట్స్ కలిగిన రెండు ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ పిక్ ను షేర్ చేశాడు. ఇవి పంపినందుకు అలియాకి థాంక్స్ చెబుతూ వాళ్ళ ముఖాలు చిరునవ్వుతో వెలిగిపోయాయి. త్వరలో తన పేరుతో కూడా ఒక బ్యాగు చూడాలనుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశాడు.

దీనికి స్పందించిన అలియా నీకోసం ఈద్ స్పెషల్ వేర్ సిద్ధం చేస్తానంటూ హార్ట్ సింబల్స్ యాడ్ చేసింది. చివరిగా థాంక్స్ చెబుతూ స్వీటెస్ట్ అని పేర్కొంది. మొత్తానికైతే ఆలియా పంపిన బ్యాగులలో బట్టలు ఎలా ఉన్నాయో చూడడానికి అభిమానులు సైతం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ సినిమాలో బిజీగా ఉన్నారు. మరొకవైపు అలియా భట్ రాఖీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని చిత్రంలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news