RRR మూవీ టీంకు కోమురం భీం మనుమడు శుభాకాంక్షలు

-

ట్రిపుల్ ఆర్ మూవీ టీం కు శుభాకాంక్షలు తెలిపారు కొమురం భీం మనుమడు కొమురం సోనే రావ్. కొమురం భీం చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ట్రిపుల్ ఆర్ తీసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే, ట్రిపుల్ ఆర్ కు ఆస్కార్ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కొమురం భీం మనుమడు.

కొమురం భీం చరిత్ర ప్రపంచానికి తెలిసేలా చేసిన రాజ మౌళి కి కృతజ్ఞతలు చెప్పారు కొమురం భీం మనుమడు కొమురం సోనే రావ్. అటు ఈ సినిమాలోని ‘నాటునాటు పాట’కు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనిక మీద తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తెలుగువారందరికి గర్వకారణంగా పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news