Andrea Jeremiah : స్టేజ్ పై ఉర్రూతలూగించిన ఆండ్రియా.. ఫొటోలు వైరల్

-

ఆండ్రియా.. ఈ తమిళ్ బ్యూటీ హీరోయిన్ గానే కాదు సింగర్ గానూ చాలా ఫేమస్. ఈ భామ తమిళ ప్రేక్షకులకే కాదు తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితం. తమిళ్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది ఆండ్రియా.

ఇక ఆండ్రియా తెలుగులోనూ పాటలు పాడి అలరించింది. రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాలో ఓయే ఓయే పాట పాడి అలరించింది. ఇక నాగచైతన్య దడ సినిమాలోని దీవాళీ దీపాన్ని పాట ఎంత ఫేమసో తెలిసిందే. ఈ బ్యూటీ అటు సినిమాల్లో నటిస్తూ.. ఇటు సింగర్ గా తన సత్తా చాటుకుంటోంది.

ఆండ్రియా అప్పుడప్పుడు లైవ్ కన్సర్ట్ లో కూడా ఇస్తుంటుంది. ఇక అవార్డు ఫంక్షన్లలో పాటలు పాడి అలరించడం కూడా ఈ బ్యూటీ చాలా ఇష్టమట. తాజాగా ఈ బ్యూటీ ఓ లైవ్ కన్సర్ట్ లో సందడి చేసింది. ఈ కన్సర్ట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రీన్ ప్యాంట్ లో బ్లాక్ క్రాప్ టాప్ లో ఆండ్రియా అందం మామూలుగా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news