‘కెజిఎఫ్ చాప్టర్ 2’ నుండి మరొక సంచలన క్యారెక్టర్ రివీల్…. ఎవరంటే….!!

-

కన్నడ నటుడు యాష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కెజిఎఫ్ చాప్టర్ 1 సినిమా 2018 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. కన్నడ లో పాన్ ఇండియా ఫీల్ తో చిత్రీకరించబడ్ద ఆ సినిమా, ఆ భాషతో పాటు హిందీ సహా పలు ఇతర సౌత్ భాషల్లో కూడా రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టింది. ఇక ఆ తరువాత కొన్నాళ్ళకు ఆ సినిమాకు సీక్వెల్ గా చాప్టర్ 2 ని మొదలెట్టింది సినిమా యూనిట్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హోంబేలె ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుండగా యాష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.

ఇకపోతే చాప్టర్ వన్ కంటే కూడా మరింత భారీ ఖర్చుతో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న చాప్టర్ 2 పై దేశవ్యాప్తంగా ఉన్న పలు భాషల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర అయిన అధీరా క్యారెక్టర్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన, పోస్టర్ రిలీజ్ చేసిన సినిమా యూనిట్,

 

నేడు ఈ సినిమాలో ప్రధానమంత్రి రమిక సేన్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటి రవీనా టాండన్ కు సంబంధించి దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ఆమె కెజిఎఫ్ సెట్స్ లో దిగిన ఒక ఫోటోని రిలీజ్ చేసారు. దర్శకుడు ప్రశాంత్ ఈ ఫోటోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. చాప్టర్ 1 ముగిసే సమయంలో రాఖీ పై డెత్ వారంట్ ఇష్యూ చేసే ప్రధానమంత్రిగా రవీనా ఈ సినిమాలో అదరగొట్టే పెర్ఫార్మన్స్ ని కనపరుస్తున్నట్లు టాక్. కాగా ఈ సినిమా మే లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది….!!

Read more RELATED
Recommended to you

Latest news