RRR Movie : ఆర్ఆర్ఆర్‏కు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం

-

ఇప్పుడు దేశంలో నంబర్ వన్ దర్శకుడిగా మన రాజమౌళి ఎదిగిన సంగతి అందరికి తెలిసిందే. బహుబలి సినిమా లతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారుమళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేశారు రాజమౌళి. ఇప్పుడు తన తర్వాత సినిమా పై మనకంటే దేశంలో ఎక్కువుగా ఆసక్తి వుంది. అయితే, ఇప్పటికే రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.

మరోవైపు ఆస్కార్ అవార్డు కోసం పలు కేటగిరీలలో పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇటీవలే న్యూయార్క్ క్రిటిక్స్ ఇచ్చే అవార్డులలో బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు అందుకున్నారు రాజమౌళి. తాజాగా మరో అరుదైన అవార్డు గెలుచుకుంది ఆర్ఆర్ఆర్. అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా నిలిచింది. అంతేకాదు, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్ లైట్ అవార్డు సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news