SSMB28 కి వర్క్ చేయనున్న ఫేమస్ ఫైట్ మాస్టర్స్ …!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేశ్ ..నెక్స్ట్ ఫిల్మ్ షూట్ విషయమై మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ మూడో చిత్రం చేయనున్నాడు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న SSMB28పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

ఈ చిత్రంలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వస్తన్నాయి. ఇందులో హీరోయిన్ గా త్రివిక్రమ్ ఆస్థాన నాయిక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ పిక్చర్ లో భారీ యాక్షన్ సీన్స్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ వచ్చింది.

సినిమా కోసం ఇటీవల కేజీఎఫ్ 2 అలాగే విక్రం లాంటి బ్లాక్బస్టర్ మూవీస్ కు వర్క్ చేసిన ఫేమస్ ఫైట్ మాస్టర్ అన్బరివు సోదరులను తీసుకొనుందట చిత్రబృందం. ఇప్పటికే వారితో డైరెక్టర్ త్రివిక్రమ్ చర్చలు కూడా సాగించాలని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే వారిద్దరి త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్టులో అడుగుపెట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version