రివేంజ్ డ్రామా ‘ఘాటి’తో వస్తున్న అనుష్క శెట్టి

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి – దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీకృష్ణా రెడ్డి, రాజీవ్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. లేడీ ఓరియెంటెండ్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఘాటి’ అనే టైటిల్ను ఖరారు చేశారు.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ముంబయిలో నిర్వహించిన ఓ ఈవెంట్లో ఈ సినిమా పేరును, ప్రీ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వ్యాపార రంగంలో అంచలంచెలుగా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు స్వార్థంతో కావాలని ఎలా నష్టపరిచారు? ఆమె నేరస్థురాలిగా ఎందుకు మారింది? ఆ తర్వాత వారిపై ఆమె ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది? అనేదే ఈ సినిమా కథాంశం అని సమాచారం. రివేంజ్ డ్రామాగా చ్చితంగా విజయం సాధిస్తుందని మేకర్స్ అంటున్నారు. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పోస్టర్ చూసి అనుష్క ఫ్యాన్స్ భలే థ్రిల్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version