రికార్డులు నాకు కొత్త కాదు.. ‘లెజెండ్‌’ పదేళ్ల వేడుకలో బాలకృష్ణసీఎంలు

-

‘‘రికార్డులు నాకు కొత్త కాదు. సృష్టించాలన్నా నేనే, తిరగరాయాలన్నా నేనే. కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతుంటాయి.” అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెజెండ్‌’ విడుదలై గురువారంతో పదేళ్లు పూర్తయ్యాయి. ఈ నెల 30న చిత్రాన్ని రీరిలీజ్‌గా చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనిల్‌ సుంకర, సాయి కొర్రపాటి హైదరాబాద్‌లో ప్రత్యేక వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు బాలయ్య హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1116 రోజులు, నాలుగు ఆటలు ఆడి మరో కొత్త రికార్డుని దాటిన దక్షిణాది సినిమా ‘లెజెండ్‌’ అని అన్నారు. ఈ మధ్య చేసిన ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్‌ కేసరి’ తదితర చిత్రాలు కూడా తనలో కసిని పెంచాయని తెలిపారు. ఇలాంటి మంచి సినిమాలు ఇస్తే మరిన్ని చేయండని వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు ప్రేక్షకులు అని చెప్పారు. మహిళల గురించి గొప్ప సందేశాన్నిచ్చిన సినిమాలు చేసే అదృష్టం తనకు కలిగిందని హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version