Taraka Ratna: ఆ టాటూ.. బాలయ్యపై తారకరత్న ప్రేమకు గుర్తు

-

నందమూరి తారకరత్నకు తన బాబాయ్​ నందమూరి బాలకృష్ణ అంటే అమితమైన ప్రేమ. ఆ అభిమానంతోనే బాలయ్యపై తన ప్రేమకు గుర్తుగాఆయన సంతకాన్ని పచ్చబొట్టు వేయించుకున్నారు తారకరత్న. మరోవైపు తారక్ అంటే కూడా బాలకృష్ణకు ఎంతో ఇష్టం. నటుడిగా ఆయన ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి నుంచి అటు కెరీర్‌ పరంగా, ఇటు వ్యక్తిగతంగానూ అన్నీ తానై అండగా నిలిచారు బాలకృష్ణ. ప్రతి విషయంలోనూ బాబాయ్‌ వెన్నుతట్టి ప్రోత్సహించేవారని తారకరత్న పలు మార్లు చెప్పుకొచ్చేవారు.

‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న కుప్పకూలిన వెంటనే విషయం తెలుసుకుని, ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అనునిత్యం తారక్ వెంటే ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించిన సమయంలోనూ తారకరత్న వెంటే ఉన్నారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో బిజీగా ఉన్నా, ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేవారు. తారకరత్న కోలుకోవాలని పూజలు, ప్రార్థనలు చేయించారు. అయినా, ఆయన ప్రాణాలను దక్కించుకోలేకపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news