ఫ్యాన్స్ గోల: ఇక్కడ కొట్లాడితే కామన్! అమెరికా ఐతేనే మజా.!

-

సినిమా హీరో అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది.ఇక వారి ఫ్యాన్స్ కు అయితే ఆ ప్రేమ గురించి చెప్పనవసరంలేదు. రిలీజ్ రోజు వారి హంగామా మరో స్తాయిలో ఉంటుంది. మారి కొంత మంది మూర్ఖపు బ్యాచ్ థియేటర్లు ను తగల బెట్టడం, వేరే వారితో గొడవలూ పడటం చేస్తూ ఉంటారు. విచిత్రంగా ఆ ఫ్యాన్స్ అభిమానించే హీరో కూడా ఈ విషయంలో కంట్రోల్ చేయరు.

తమిళ జనాల్లో ఉండే ఈ హీరోల ఫ్యాన్స్ గోల ఇప్పుడు తెలుగు ప్రజలకు కూడా పాకింది.ఇక మనోళ్లు ఇక్కడ గొడవ పడితే నార్మల్ అనుకున్నారేమో అందుకే మనోళ్లు అమెరికాలో గొడవపడి హల్చల్ చేశారు.వివరాల్లోకి వెళ్తే.. డల్లస్ లో 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా.. మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో బాలయ్య ప్యాన్స్ తో పాటు.. పవన్ ఫ్యాన్స్ కూడా పాల్గొన్నారు.

ఈక్రమంలో జై బాలయ్య , జై పవన్ అంటూ ఇరు వార్గాలు నినాదాలు చేయడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈక్రమంలోనే వారి మధ్య మాటా మాటా పెరిగి దాడుల వరకూ వెళ్ళింది. దాంతో అక్కడి ఈవెంట్ మేనేజర్లు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. ఈ దాడిలో వారికి కూడా గాయాలు అయ్యాయి. దాంతో ఈవెంట్ మేనేజర్లు పోలీసులను ఆశ్రయించడంతో… వారు వచ్చి అక్కడ పరిస్థితిని చక్కదిద్దారని తెలుస్తోంది. దేశం దాటిపోయినా కూడా మన వాళ్ల బుద్ధులు మారలేదుగా..

Read more RELATED
Recommended to you

Exit mobile version