Big Boss OTT Telugu: ‘బిగ్ బాస్’ ఫైనల్ వీక్..వేరే లెవల్‌లో బాబా భాస్కర్ ఏవీ..

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ OTT వర్షన్ గేమ్ ఫైనల్ వీక్ లోకి ఎంటరయింది. హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు టైటిల్ గెలుచుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టాప్ ఫైవ్ లో నిలవడమే కాదు..టైటిల్ గెలుచుకోవాలని ప్రతీ ఒక్క కంటెస్టెంట్ అనుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులు బాబా భాస్కర్ మాస్టర్..కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. సదరు ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. అందులో బాబా భాస్కర్ మాస్టర్ గురించి వివరించారు.

బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్..వినోదానికి కేరాఫ్ అయి మంచి పేరు సంపాదించుకున్నారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌నూ తన సొంతం చేసుకన్న మాస్టర్..ఫైనల్ విజేతగా నిలిచే చాన్సెస్ ఉన్నాయని అంటున్నారు బీబీ లవర్స్. ‘బిగ్ బాస్’ ఈ సందర్భంగా బాబాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

బ్యాక్ గ్రౌండ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఛత్రపతి’.. సినిమాలోని ‘అగ్నిస్కలన’ సాంగ్ ప్లే అవుతుండగా, బాబా మాస్టర్ హ్యాపీగా ఫీలయ్యారు. వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌజ్ లోకి వచ్చిన వారు ఇప్పటి వరకు ఫైనల్ వీక్ వరకు రాలేదు. కాగా, బాబా మాస్టర్ బిగ్ బాస్ హిస్టరీలో సరికొత్త అధ్యాయం రాస్తారని ఆకాంక్షించారు ‘బిగ్ బాస్’. ఇక తను హౌజ్ లోకి ఏదో ఒకటి చేసే వెళ్లాలని వచ్చానని చెప్పాడు బాబా భాస్కర్ మాస్టర్.

 

Read more RELATED
Recommended to you

Latest news