బిగ్‌బాస్ 4: ‌విన్న‌ర్ ఎవ‌రో రాహుల్ చెప్పేశాడు!

-

బిగ్‌బాస్ సీజ‌న్ 3 విన్న‌ర్ రాహుల‌్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ సీజ‌న్ 4 విన్న‌ర్ ఎవ‌రో చెప్పేశాడు. ఈ వారం అమ్మ రాజ‌శేఖ‌ర్ ఎలిమినేట్ కావ‌డంతో హౌస్‌లో 9 మెంబ‌ర్స్ మిగిలారు. అభిజిత్, అవినాష్‌, అఖిల్‌, హారిక‌, లాస్య‌, మోనాల్‌, సోహైల్‌, మెహ‌బూబ్, అరియానా వున్నారు. వీరిలో ఆరుగురు అంటే అరియానా, అభిజిత్‌, మోనాల్‌, హారిక‌, మెహ‌బూబ్, సోహైల్ ఎలిమినేష‌న్‌లో వున్నారు. ఇందులో అత్య‌ధిక స‌భ్యులు నామినేట్ చేసిన ఒక‌రు ఎలిమినేట్ కాబోతున్నారు.

అది అరియానా అని క్లియ‌ర్‌గా తెలుస్తోంది. దీంతో ఇంటిలో వున్న స‌భ్యుల్లో ఎవ‌రు ఈ సీజ‌న్ విన్న‌ర్ అనే దానిపై ప‌లు ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఈ ఊహ‌గానాల‌కి బ‌లాన్ని చేకూరుస్తూ క్లియ‌ర్‌గా రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ విజేత ఎవ‌రో చెప్పేశాడు. ఇంటి స‌భ్యుల్లో అభిజిత్, అవినాష్‌, అరియానా, అఖిల్, సోహైల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా క‌నిపిస్తున్నార‌ని, టాప్ 5లో వీరు వుంటార‌ని అయితే ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లే వీరిలో కొన్ని మైన‌స్‌లు, ప్ల‌స్‌లు వున్నాయ‌ని రాహుల్ చెప్పాడు.

లాస్క్‌లు స‌రిగా ఆడ‌డ‌ని, ప‌క్క‌వారిని లెక్క‌చేయ‌ని త‌త్వం వ‌ల‌న అభిజిత్‌కు కొంత నెగెటివ్ మార్క్స్ వున్నాయ‌ని అయితే అత‌ని మైండ్ గేమ్ ప్ల‌స్ అవుతుంద‌న్నాడు. అఖిల్ కూడా టాస్క్‌లు అంటే ఆస‌క్తి చూపించ‌డు. యాటిట్యూడ్ వున్న వ్య‌క్తిగా అత‌నికి మైన‌స్ మార్కులు ప‌డుతున్నాయ‌ట‌. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడం అరియాన‌కు ప్ల‌స్‌గా మారిన బిగ్‌బాస్ పేరుతో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డం మెయిన్ మైన‌స్‌గా ప‌రిణ‌మించింద‌న్నాడు. అవినాష్ కామెడీతో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసినా ఆ త‌రువాత అదే అత‌నికి మైన‌స్‌గా మార‌నింద‌ని, ఇత‌రుల‌ని నొప్పించ‌డం, సంయ‌మ‌నం కోల్పోవ‌డం అవినాష్‌కు మైన‌స్‌లుగా మారా‌య‌ట‌. సోహైల్ కోపాన్ని త‌గ్గించుకుంటూ మార్కులు కొట్టేస్తున్నాడు. అయితే ఇంటిలో వున్న ఈ ఐదుగురు కంటెస్టెంట్‌ల‌లో టైటిల్‌ని గెలిచేది మాత్రం అభిజిత్ అని త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news