NTR 30 : ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా మరో స్టార్ ?

-

ఎన్టీఆర్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. రాజ మౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో తన నటన తో భారత దేశంలో లోనే కాక, హాలీవుడ్ వాళ్ళను సైతం ఆశ్చర్యపరిచాడు. కాని జూ ఎన్టీఆర్ తర్వాత సినిమా గురించి అప్డేట్ లేక ఫ్యాన్స్ చాలా నిరుస్తాహం గా వున్నారు.

తాను చేయబోయే చిత్రం 30 వది కావడంతో నందమూరి అభిమానులే కాదు, టాలీవుడ్ సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రేక్షకులు చూస్తున్నారు.

ఎన్టీఆర్‌ 30 నుంచి జాన్వీ కపూర్‌ లుక్‌ ను రెండు రోజుల కిందనే రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. అయితే, ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కు విలన్‌ గా మొదట సంజయ్‌ దత్‌ ను తీసుకున్నారని వార్తలు రాగా.. ఇప్పుడు మరో స్టార్‌ పేరు తెరపైకి వచ్చింది. సైఫ్‌ అలీ ఖాన్‌ ను తీసుకున్నారని టాక్‌ వినిపిస్తోంది. అయితే.. వీరిద్దరిలో ఎవరు ఫైనల్‌ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news