బ్రహ్మాస్త్ర పార్ట్ 2, 3 రిలీజ్ డేట్ అవుట్.. షాక్ అవుతున్న అభిమానులు

-

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మస్త్ర సినిమా గత ఏడాది విడుదలై మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. కాగా ఈ సినిమా పార్ట్ 2, 3 త్వరలోనే విడుదల కాబోతున్నట్టు వార్తలు వినిపించగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు దర్శకుడు అయాన్ ముఖర్జీ.

రన్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మస్త్ర సినిమా పార్ట్ 2, 3 విడుదలవుతాయని వార్తలు వినిపిస్తుండగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని ప్రచారం కూడా జరిగింది. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ ఈ సినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ తాజాగా ట్విట్టర్ వేదికగా క్రేజీ అప్డేట్ ఇచ్చేశారు. ఈ రెండు భాగాలు ఎప్పుడు విడుదలవుతాయో ప్రకటించేశారు. అయితే ఈ ట్వీట్ చూసిన అభిమానులంతా షాక్ అయిపోతున్నారు.

భారీ బడ్జెట్ గా తెరకెక్కిన బ్రహ్మస్త్ర సినిమా గత ఏడాది సెప్టెంబర్ లో విడుదలై మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాలో రణ్బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించగా షారుఖ్ ఖాన్, నాగార్జున అతిధి పాత్రల్లో మెరిసారు. అలాగే అమితాబచ్చన్, మౌని రాయ్ సైతం ప్రధాన పాత్రల్లో కనిపించారు.

కాగా బ్రహ్మస్త్ర సినిమా మూడు భాగాలుగా తెరకెక్కనున్నట్టు ముందు నుంచి వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి. మొదటి భాగం విడుదలై మంచి హిట్ టాక్ సంపాదించుకున్నాక ఇక మిగిలిన రెండు భాగాలు ఎప్పుడు వస్తాయో అంటూ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ దీనిపై ఇప్పటి వరకు చిత్ర బంధం ఎలాంటి సమాచారం ఇవ్వకపోగా దర్శకుడు అయాన్ ముఖర్జీ మిగిలిన రెండు భాగాల రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశాడు. బ్రహ్మస్త్ర రెండో పార్ట్ 2026లో మూడో భాగం 2027 లో విడుదల కాబోతున్నట్టు తెలిపారు.

ఈ ట్వీట్ తో షాక్ అవుతున్న అభిమానులు మరిన్ని ప్రశ్నలు లేవనెత్తారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఆనందంగా ఉన్నప్పటికీ అంత లేటు ఎందుకు అవుతుందో అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే ఫస్ట్ పార్ట్ లో నటించిన రణబీర్ కపూర్ మిగిలిన భాగాల్లో కూడా హీరోగా కనిపించడం ఉన్నారా లేక వేరే ఎవరైనా నటిస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news