రవితేజ ” ఒక చిన్న హీరో ” చిరంజీవి హాట్ కామెంట్స్..మాస్ మహారాజ్ ఫ్యాన్స్ సీరియస్ !

-

చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో తాజాగా శనివారం సాయంత్రం హనుమకొండలో వాల్తేరు వీరయ్య విజయ విహారం పేరుతో సక్సెస్ సెలబ్రేషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రవితేజ గురించి ఆయన మాట్లాడారు.

నటీనటుల విషయానికి వస్తే మొదట రవితేజ గురించి మాట్లాడాలని, రవితేజని చూస్తుంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూస్తున్నట్టే ఉంటుందని, అప్పట్లో ఇద్దరు ఒకేలా ఉండేవారని తెలిపారు. రవిలో నా తమ్ముడిని చూసుకున్నానని తెలిపారు. ముఖ్యంగా సినిమాలో రవితేజ పాత్ర చనిపోయినప్పుడు చాలా ఎమోషనల్ గా అనిపించిందన్నారు.

ఆ టైములో రవితేజ స్థానంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ ని ఊహించుకున్నానని, అందుకే ఆటోమేటిక్ గా తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. గ్లిజరిన్ వాడకుండానే ఆ సీన్ చేయగలిగానని తెలిపారు. దీనిపై తనకు దర్శకుడు, నిర్మాతలు ఇతర టీం నుంచి మంచి అప్రిషియేషన్స్ వచ్చాయని చెప్పారు. అయితే, ఫంక్షన్ లో రవితేజ ను ” ఒక చిన్న హీరో ” అని మెగాస్టార్ అనడం పై అసంతృప్తి గా ఉన్నారు రవితేజ అభిమానులు. ఇక చిరంజీవి చేసిన కామెంట్స్‌ తో సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు రవితేజ ఫ్యాన్స్‌.

Read more RELATED
Recommended to you

Latest news