ఓ కమర్షియల్ కథ అన్వేషణలో చిరంజీవి!

-

చిరంజీవి ఒక కమర్షియల్ కథ కోసం అన్వేషిస్తున్నారు.ఏ కొత్త దర్శకుడు కనిపించిన” నీ దగ్గర కమర్షియల్ స్టొరీ లైన్ ఏమైనా ఉందా” అని అడుగుతున్నారు.అయితే తన కోసం కాదు వరుణ్ తేజ్ కోసం.వరుణ్ మంచి పోటాన్శాలిటీ ఉన్న హీరో.మంచి కథ వస్తే..దుమ్ము దులుపుతాడు.మంచి హిట్లు కూడా ఉన్నాయి.అయితే “గని” బాగా నిరాశపరిచింది.ఎంత అంటే వరుణ్ కి థియేట్రికల్ బిజినెస్ లేదేమో అనిపించేంతలా..!ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్.అయితే అది ఏసి, డిసి, ప్రవీణ్ సత్తారు ఎప్పుడూ కమర్షియల్ గా గొప్ప కథలేమ్ తీయలేదు.బాక్సాఫీసు దగ్గర ఓకే అనిపించే సినిమాలే అన్ని.

కాకపోతే విమర్శకుల ప్రశంసలు మాత్రం దక్కుతాయి.వరుణ్ కి అదేం కొత్త కాదు..కాబట్టి తనకు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ హిట్ కావాలి.ఆ బాధ్యతని చిరు తీసుకున్నట్లు తెలుస్తోంది.గని రిజల్ట్ తో చిరు కూడా చాలా అప్ సెట్ అయ్యారని వినికిడి.గని బాధ్యతల్లోగని బాధ్యతలను పూర్తిగా అల్లు అరవింద్ అండ్ ఫ్యామిలీ తీసుకుంది.ఈ విషయంలో చిరు మాత్రం జోక్యం చేసుకోలేదు.ఫలితం రివర్స్ కొట్టేసరికి..వరుణ్ తేజ్ కెరీర్ నా గాడిలో తీసుకోవాల్సిన బాధ్యత గుర్తించారు.అందుకే చిరు రంగంలోకి దిగారు.ప్రవీణ్ సత్తారు సినిమా కంటే ముందు..ఓ కమర్షియల్ కథని ఓకే చేసి..రెండిటిని సమాంతరంగా పూర్తి చేయాలన్నది ప్లాన్.

Read more RELATED
Recommended to you

Latest news