మెగాస్టార్, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి సంచలన ప్రకటన చేశాడు. తన రాజకీయాల రీఎంట్రీ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాలకు దూరంగా ఉంటాను.. నేను పూర్తి చేయలేనిది నా స్థానంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అంటూ వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి.
తాజాగా ఓ సినిమా ఈవెంట్ కు హాజరైన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయాల రీ ఎంట్రీ పైన క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మధ్య నేను వాళ్ళకి వీళ్ళకి దగ్గరయ్యాను ఫలానా పార్టీలో చేరుతానని అనుకుంటున్నారు కానీ అలాంటిది ఏమీ లేదని వెల్లడించారు చిరంజీవి. రాజకీయాల పరంగా నేను అనుకున్న లక్ష్యాలను, సేవా భావాలను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడన్నారు.