సైరా డైరక్టర్ గా చిరంజీవి..?

-

మొదటి నుండి సైరా నరసింహా రెడ్డి దర్శకుడు సురేందర్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవికి అసలేమాత్రం పడట్లేదని వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే సూరి చేయాల్సిన డైరక్షన్ కాస్త చిరు చేశాడట. ఏంటి వ్యవహారం మరింత ముదిరిందా ఏంటి అంటే.. షెడ్యూల్ అనుకున్న టైం కు గంట లేటుగా సురేందర్ రెడ్డి వచ్చాడట. అయితే ఆలోపు సూరి బదులుగా చిరంజీవి కొన్ని సీన్స్ డైరెక్ట్ చేశారట.

మళ్లీ దర్శకుడు సురేందర్ రెడ్డి రాగానే యథావిధిగా అతను డైరెక్ట్ చేశాడట. ఈ న్యూస్ బయటకు రాగానే సైరా నుండి సూరి బయటకు వస్తున్నాడన్న వార్తలు వస్తున్నాయి. సినిమా అవుట్ పుట్ మీద చిరు, సూరి గొడవ పడుతున్నారే తప్ప అతని పనితనానికి చిరంజీవి ఫిదా అయ్యాడని తెలుస్తుంది. రాం చరణ్ నిర్మాణంలో వస్తున్న సైరా నరసింహా రెడ్డి మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news