చిత్ర’లహరి’కి మరో క్రేజీ ఆఫర్..!

27

మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా వచ్చిన చిత్రలహరి సినిమాలో లహరిగా మెప్పించిన చిన్నది కళ్యాణి ప్రియదర్శన్. హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కళ్యాణి ప్రియర్శిని ఆ సినిమాతో ఫెయిల్ అయినా చిత్రలహరితో మాత్రం హిట్టు కొట్టింది. చిత్రలహరి సినిమాలో క్యూట్ లుక్స్ తో కళ్యాణి ప్రియదర్శన్ ప్రేక్షకుల మనసు గెలిచింది. ఈ సినిమా హిట్ అవడంతో ఆమెకు మరో లక్కీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

లవర్ బోయ్ నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరక్షన్ లో వస్తున్న భీష్మ సినిమాలో కళ్యాణి ఛాన్స్ దక్కించుకుందట. భీష్మ మూవీలో ఆల్రెడీ రష్మిక మందన్న సెలెక్ట్ అయ్యింది. అయితే కళ్యాణి అందులో సెకండ్ హీరోయిన్ గా చేస్తుందట. సెకండ్ హీరోయిన్ అనుకున్నా సినిమాలో ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. ఈమధ్య వచ్చిన భీష్మ పోస్టర్ అలరించగా సినిమాతో నితిన్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి నితిన్ భీష్మతో ఎలాంటి సత్తా చాటుతాడో చూడాలి.