దర్శకరత్న దాసరి రానారయణరావు బయోపిక్ పై వర్మ కన్నేసాడా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. దాసరి సర్గస్తులైన తర్వాత ఆయన బయోపిక్ వెండితెరకెక్కనుందని ప్రచారం సాగింది. ఆయన ప్రియ శిష్యుడు ప్రభు ఆబాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని వినిపించింది. కానీ అంతటి సాహసం ఆయన చేయలేదు. అంత ధైర్యం తనకు లేదని పబ్లిక్ గానే చెప్పారు. దీంతో ఆ తర్వాత ఏదో ఒక సీనియర్ దర్శకుడు రంగంలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం సాగింది. కానీ ఏ ఒక్కరూ ఆ బాధ్యత తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పేరు తెరపైకి వచ్చింది.
వర్మ మనసులో దాసరి బయోపిక్ చేయాలని ఉందని ఆయన సన్నిహితుల నుంచి లీకులందాయి. ఈమాట ఆ నోట ఈ నోట చేరి చివరికి సోషల్ మీడియాకి ఎక్కింది. మరి ఇందులో నిజమెంతో? తెలియదు గానీ! వర్మ గనుక బయోపిక్ బాధ్యతలు తీసుకుంటే దాసరి బయోపిక్ కు సార్ధకత జరుగుతుంది. జీవిత కథలను తెరకెక్కించడం వర్మకు కొట్టిన పిండి అని చెప్పాల్సిన పనిలేదు. వాస్త సంఘనటలతో, బయోపిక్ లతో వర్మ చెడుగుడు అడుకుంటాడు. ఆ రకంగా ఆయనకు సక్సెస్ రేటు కూడా ఎక్కువగానే ఉంది. ఆ విషయంలో బాలీవుడ్ దిగ్గజాలనే పక్కకు నెట్టిన దర్శకుడు.
ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ ను లక్ష్మీస్ ఎన్టీఆర్ టైటిల్ తో తెరకెక్కించి సంచలనం సృష్టించాడు. ఎన్టీఆర్ లో కొన్ని అంశాలను తీసుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసి సినిమాను తెలివిగా కమర్శిలైజ్ చేసాడు. ఇక దాసరి బయోపిక్ లోనూ ఎన్నో ఒడిదుడుకులున్నాయి. దాసరి సినీ పరిశ్రమకు సామాన్యుడిగా వచ్చి అసామాన్యుడిగా ఎదగడంలో ఎంతో కృషి ఉంది. 140 సినిమాలు తెరకెక్కించిన దిగ్గదర్శకుడు. తాత మనవడు దగ్గర నుంచి ఎర్రబస్సు వరకూ ఆయన ప్రయాణం ఎంతో గొప్పది. ఇక రాజకీయాలలోనూ ఆయన చక్రం తిప్పారు. చివరిగా బొగ్గు కుంభకోణం ఆయనపై ఓ చెరగని మచ్చ. ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలు దాసరి కథలో ఉన్నాయి. కాబట్టి వర్మ బాధ్యతలు తీసుకున్నా ఆశ్చర్యపోనసరం లేదు.