మరో సారి తన తెలివితేటలు చూపిన దిల్ రాజు..!!

-

నేచురల్ స్టార్ నాని  హీరోగా నటిస్తున్న దసరా సినిమా  మార్చి నెలలో రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా తో కచ్చితంగా హిట్ కొట్టాలని చాలా కష్టపడుతున్నాడు. ఇక హిట్ కోసం నాని మొత్తం  మమ మాస్ లాగా  తయారు అయ్యాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో లాగా నాని గడ్డం తో చింపిరి జుట్టు పాత లుంగీ నలిగిన చొక్కాతోచాలా మాస్ గా  హడావుడి చేస్తున్నాడు.

సినిమాను ఈ ఏడాది మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా దసరా సినిమా టీజర్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.టీజర్ రాకతో ఒక్కసారిగా సినిమా పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక టీజర్ చూసిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి తో పాటు మరి కొంత మంది ఈ సినిమా పై ప్రశంశల వర్షం కురిపించారు.

ఇక ఈ చిత్రం డిస్ట్రిబ్యూట్ చేయడానికి అనేక మంది ఎగబడుతున్నారు. తెలుగులో ఈ సినిమా హక్కులను చదలవాడ శ్రీనివాసరావు కొనుగోలు చేశారు. అయితే టీజర్ చూసిన తర్వాత దిల్ రాజు ఈ సినిమాకి అదనంగా నాలుగు కోట్ల రూపాయలు చదలవాడ శ్రీనివాసరావుకు ఇచ్చి  డిస్ట్రిబ్యూషన్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఇప్పుడు దిల్ రాజు నుంచి అన్ని ఏరియాల హక్కులు కొనుక్కోవడానికి అన్ని ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఎంతైనా దిల్ రాజు తెలివి తెలివే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news