మంచు మనోజ్ – మౌనిక రెడ్డి వివాహం ఇటీవల మంచు లక్ష్మీ నివాసంలో జరిగింది. ఈ పెళ్లికి పలువురు ప్రముఖులు , రాజకీయ నాయకులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలోనే ఈ జంట తాజాగా తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. మౌనిక తో తనకు 12 ఏళ్లుగా పరిచయం ఉందని నాలుగేళ్లుగా ఇద్దరం చాలా బాధలు పడ్డాం అంటూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఇక ఇది ఇలా ఉండగా..మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదం చోటు చేసుకుంది. హీరోలు, అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. అన్న విష్ణు ఇళ్లలోకి చొరబడి తన వాళ్లను, బంధువుల్ని ఇలా కొడుతుంటాడని, ఇది సిచ్యుయేషన్ అంటూ మనోజ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియోలో విష్ణు ఎవరిపై దూసుకెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆయనను అదుపు చేస్తున్నట్లు ఉంది. కాగా మనోజ్ పెళ్లి సమయం నుంచి అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది.