తారకరత్న చేతి పై ఉన్న టాటూ కి.. బాలకృష్ణకి మధ్య సంబంధం ఏంటో తెలుసా..?

-

నందమూరి తారకరత్న శనివారం రాత్రి మరణించడంతో నందమూరి ఫ్యామిలీలో మరొక విషాదం చోటుచేసుకుంది. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందిన తారకరత్న కోలుకోలేక మృతి చెందారు. మెదడుకు సంబంధించిన సమస్యల వల్లే ఆయన మృతి చెందారు అని వైద్యులు స్పష్టం చేశారు. తారకరత్న మరణ వార్తను ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే చివరి కోరిక తీరకుండానే ఆయన మృతి చెందారు. సినిమాలలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాని తారకరత్న రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే ఆ చివరి కోరిక తీరకుండానే ఆయన మృతి చెందారు.

తారకరత్న మృతికి అభిమానులు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తారకరత్న చేతిపై ఉన్న టాటూ ఇప్పుడు మరొకసారి వైరల్ గా మారింది. సింహం ముద్ర తో పాటు బాలయ్య ఆటోగ్రాఫ్ ఉండడం ఈ టాటూ ప్రత్యేకత. బాబాయ్ బాలయ్య పై ఉన్న అభిమానంతో తారకరత్న ఈ టాటూ వేయించుకున్నారు. తారకరత్న కెరియర్ పరంగా సక్సెస్ కావాలని కష్టపడ్డ వారిలో బాలయ్య కూడా ఒకరు.. అయితే తారకరత్న నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ అవ్వగా మరికొన్ని సినిమాలు విజయాన్ని అందుకోలేదు..

తారకరత్న మరణ వార్త విన్నప్పటి నుంచి బాలయ్యను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదని తెలుస్తోంది. అంత బాధలో ఉన్నప్పటికీ కూడా తారకరత్న భార్య పిల్లలకు ఆయనే ధైర్యం చెబుతున్నారని సమాచారం. వరుసకు బాబాయి అయినా సరే తారకరత్నను తండ్రిలా చూసుకున్నారు. అందుకే తనకి కొడుకు కంటే ఎక్కువైనా తారకరత్న మరణించడంతో బాలయ్య బాబు శోకసంద్రంలో మునిగిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version