రాజేంద్రప్రసాద్ సతీమణి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

-

నటకిరీటి రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రతి వ్యక్తి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని అంటారు. అది భార్య అయినా కావచ్చు లేదా తల్లి , స్నేహితులు ఇలా ఎవరైనా సరే కావచ్చు. అయితే సినీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది తమ ఎదుగుదలలో భార్య పాత్ర ఎంతో ఉందని చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, కమెడియన్ గా సత్తా చాటిన నటుడు రాజేంద్రప్రసాద్.. ఎప్పుడూ కూడా మీ విజయం వెనుక ఎవరున్నారు అని అడిగితే ఆయన ఎప్పుడూ చెప్పే మాట ఆయన సతీమణి విజయ చాముండేశ్వరి గురించి.. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు సినీ నేపథ్యం అంటే పెద్దగా నచ్చేది కాదు..

రాజేంద్రప్రసాద్ కూడా సినిమా విషయాలను ఏమాత్రం కూడా కుటుంబంలో చెప్పకుండా భార్యా పిల్లలతో సంతోషంగా జీవించేటట్టు అలవాటు చేసుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా విజయ చాముండేశ్వరి సినిమాల పై అవగాహన పెంచుకోవడం వల్లే భర్త పై వచ్చే ఆరోపణలను ఆమె ఏమాత్రం కూడా నమ్మేది కాదు. ఇక 1980 -90 దశకాలలో తిరుగులేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ ఒక్కో మెట్టు ఎదుగుతూ మంచి విజయం సాధించడం వెనుక ఆయన భార్య విజయ చాముండేశ్వరి ఉండటం గమనార్హం.

ఇకపోతే ఒకానొక దశలో అన్ని అపజయాలతో దెబ్బతినేసి కృంగిపోతున్న సమయంలో కొండంత ధైర్యాన్ని ఇచ్చి వెన్నంటే ఉందట. ఏ సినిమా ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నా సరే తన విజయం వెనుక తన భార్య హస్తం ఉంది అని గర్వంగా చెబుతూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మహిళ ఉన్నట్టుగానే తన జీవితంలో కూడా తన భార్య విజయ చాముండేశ్వరి ఉందని అప్పటికీ.. ఇప్పటికీ .. ఎప్పటికీ తను ఉంటే చాలు విజయం సాధిస్తానని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version